Sankatahara Chaturthi vinayaka Vratham

సంకటహర చతుర్థి వినాయక వ్ర‌తం
 – డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

30.00

మరిన్ని Telugu Books కై
,
Share Now

Description

సంకటహర చతుర్థి వినాయక వ్ర‌తం
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

స‌క‌ల విఘ్నాల‌కు అధిప‌తి ఆదిదంప‌తుల కుమారుడైన వినాయ‌కుడు. ఆయ‌న‌ను పూజిస్తే అన్నిసంక‌టాలు తొల‌గిపోతాయి. అందుక‌నే ప్ర‌తిమాసంలో పౌర్ణ‌మి అనంత‌రం వ‌చ్చే చ‌తుర్థినాడు సంకటహర చతుర్థిని నిర్వ‌హిస్తాం. దీనినే సంక‌ష్ట‌హార చ‌తుర్థి అని కూడా అంటారు. చ‌వితికి అధప‌తి వినాయ‌కుడు. స్వామిని ఈ రోజున నిండుమ‌న‌సుతో కొలిస్తే అన్ని సంక‌టాలు తొల‌గిపోతాయ‌ని గ‌ణ‌ప‌తిపురాణం పేర్కొంటుంది. సాధార‌ణంగా ఈ పూజ చేసేవారు ఆ రోజున ఉప‌వాస‌ముండాలి.సాయంత్రం చంద్ర‌ద‌ర్శ‌నం త‌రువాత విర‌మించాలి. స‌మీప గ‌ణ‌ప‌తి ఆల‌యంలో జ‌రిగే సంక‌ట‌హార‌చ‌తుర్థి వ్ర‌తంలోపాల్గొనాలి. వినాయ‌క‌చ‌వితిరోజున చంద్రున్ని చూడ‌కూడ‌దు. అయ‌తే సంక‌ట‌హార చ‌తుర్థి రోజున చంద్రున్ని చూడాలి. మంగ‌ళ‌వారంనాడు వ‌చ్చే సంక‌ట‌హార‌చ‌తుర్థిని అంగార‌క చ‌తుర్థి అంటారు. ఆ రోజున ఈ వ్ర‌తంనిర్వ‌హిస్తే మ‌రిన్ని మంచి ఫ‌లితాలు ల‌భిస్తాయి.
సంకష్టహర గణపతి
గణేశుని వ్రతాలలో అత్యంత ప్రభావవంతమైనదీ, సర్వ సంకటాలను నివారించేదీ సంకష్టహర గణపతి వ్రతం. గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే ‘వినాయక చవితి’. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.
సంకటహర గణపతి :
సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూగణేశుని వ్రతాలలో అత్యంత ప్రభావవంతమైనదీ, సర్వ సంకటాలను నివారించేదీ సంకష్టహర గణపతి వ్రతం. గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే ‘వినాయక చవితి’. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.
సంకటహర గణపతి :
సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ ఆదివారం మరియు మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి.
వ్రత కథ :
పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.
గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.జింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి.
వ్రత కథ :
పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.
గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.