Description
శ్రీ సాయినాధ స్తోత్రమంజరి
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్
షిరిడి గ్రామంలో ఎండ మండు తోంది !
తన భుజానికి ఒక జోలీ తగిలించుకొని బయల్దేరినాడు ఒక బిచ్చగాడు !
ఒక చేతిలో తమరేలు ! కాలికి జోళ్ళు లేవు అయినా
అతని ముఖంలో ఎదో వింత వెలుగు ! ” అమ్మ భిక్షాం దేహి !”
ఏదైనా ఒక రొట్టి ముక్క ! ఓ పప్పు,లేదా చారు ! దానం చేయి తల్లి!”
అన్ని ఇళ్ల తలు పులు చేర వేసి వున్నై-వడ గాలుల నుండి రక్షణగా!
ఆ భిక్షువు కు అవి ఏమి పట్టవులావుంది . తన జోలె నిండాలె . తన తమరేలు నిండాలె
అతని కోసం మసీదు వద్ద ఎన్నో జీవాలు ఎదురు చూస్తూ ఉంటాయి మరి !
అతని అంతరంగం నిర్హేతుక దయాసాగరం !
సర్వజీవత్ ప్రేమ -సర్వ మత సహనం అతని మతం.
దయ -ప్రేమ అతని పద రక్షలు !