Adipudi Venkata Siva Sairam డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్
Part 1
Part 2
ఈ వ్రతము వివాహము కావలసిన కన్యలకు కల్పవృక్షం వంటిది. ఏడువారాలు భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. 6వ వారం ఉద్యాపన జరపాలి. మంగళవారంనాడు సూర్యాస్తమయకాలములో వ్రతాన్ని ఆచరించాలి. పగలంతా పండ్లు పాలుతీసుకుని రాత్రి వ్రతమైన తరువాత భోజనం చేయాలి. ఈ వ్రతాచరణము వల్ల వివాహమునకు ప్రతిబంధకమయిన కుజదోషములు ఇతర ప్రతిబంధక దోషములు నివారణమై శీఘ్రముగా వివాహమై అఖండ సౌభాగ్యముతో తులతూగుతారు.వ్రతము పూర్తి చేసిన తరువాత వ్రతకథ విని కథాక్షతలను అమ్మవారి మీద వుంచి తరువాత ఆ అక్షతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకుని ఆశీర్వాదము తీసికుని రాత్రి భోజనం చేయాలి. మంగళ వారాలు భక్తితో జరుపాలి. మధ్యలో ఏ వారమైన ఆటంకం కలిగితే ఆ పై వారం జరుపుకోవచ్చు. ఇలా ఏడు వారాలయ్యాక ఏడో మంగళవారం ఉద్యాపన జరుపుకోవాలి.ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటి పోయాలి. అలా కాని వారు ఉదయం ముత్తైదువుల గృహాలకు వెళ్లి కుంకుడు కాయలు, పసుపు, తలస్నానానికి ఇచ్చి రావాలి. ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలు, ఏడు చెరుకు ముక్కలు, ఏడు రవికలు వాయనమిచ్చి (ఒక్కరికి చీర ఇచ్చి) వారిచే అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం పొందాలి. పగలు నిద్రపోకూడదు. చివరి వారంలో పుణ్యస్త్రీలకు దక్షిణ తాంబూలాదులతో కనీసం 7 కాత్యాయనీ వ్రత పుస్తకాలను సమర్పించాలి. ఆర్ధిక స్తోమత లేని వారు వ్రతం ఆచరించలేని వారు ఏడుగురు వివాహం కాని కన్యలకు ఏడు పుస్తకాలను యిస్తే చాలా మంచిది…
———————— కాత్యాయని వ్రతాన్నిఎందుకు? ఎలా చేయాలి ?
శ్రీ కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో చేస్తారు. కాత్యాయని వ్రతాన్ని కన్యలు ఆచరించవచ్చు. వివాహము రద్దైన వారు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొనే వారు. వివాహము అయి విడాకులు తీసుకున్నవారు, తరచూ వివాహ ప్రయత్నాలు విఫలమైనట్లు అనిపించే వారు ఈ వ్రతాన్ని అనుసరించవచ్చు. ఇంకా మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు, జాతక చక్రంలో కుజదోషం వున్నవారు, ఆర్థిక స్తోమత లేక వివాహానికి ఆటంకాలు కలవారు ఆచరించవచ్చు. స్త్రీ జాతక చక్రంలో రాహుకేతు దోషాలు వున్నవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
వ్రతాన్ని ఎలా ఆచరించాలి … నియమాలేంటి ?
శ్లో” కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలేతత్రస్థితో బ్రహ్మ మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యదర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
అయాన్తు శ్రీ కాత్యాయనీ పూజార్ధం దురితక్షయ కారకాః
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాణి సంపోక్ష్య
మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆరంభించాలి. మంగళవారం కృత్తిక నక్షత్రమైతే ఇంకా మంచిది. నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి పర్వదినాలలో ఈ వ్రతం ఆచరించవచ్చు. దేవినవరాత్రులు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు.
ముందుగా పసుపుతో గణపతిని చేసి గణపతికి పూజ చేయాలి. తరువాత పసుపు రాసిన పీటపై బియ్యం పోసి దానిపై కలశాన్ని వుంచి కలశంలో పవిత్రమైన నీరుసగం పోయాలి. అమ్మ వారి విగ్రహం (ఉన్నట్లయితే) లేదా ప్రతిమగా రూపాయి వుంచాలి. ఇంటిలో తూర్పు వైపున ఈశాన్య దిక్కున శుభ్రం చేసి ముగ్గులు వేసి ఎర్ర కండువ పరిచి దాని మీద బియ్యంపోసు కోవాలి. బియ్యం పైన రాగి చెంబుకానీ, ఇత్తడి చెంబుకానీ ఉంచి టెంకాయను వుంచి దానిపై ఎర్రని రవిక కిరీటంలా పెట్టాలి (కలశస్థాపన చేయాలి). ఈ వ్రతంలో ఎర్రని పువ్వులు ఎర్రని అక్షతలనే వాడటం శ్రేష్ఠం. వ్రతం పూర్తి అయిన తరువాత వండిన భోజనపదార్థాలు నైవేద్యం పెట్టాలి. షోడశోపచార పూజ జరుపుకోవాలి. వ్రత మండపంలో పార్వతీపరమేశ్వరుల ఫోటో ఖచ్చితంగా ఉండాలి. సాయంకాలం ఈ వ్రతాన్ని ఆచరించాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. వ్రతం పూర్తి అయిన తరువాత భోజనం చేయాలి. వ్రతం ఆచరించే రోజు తలస్నానం చేయాలి.
ఈశాన వామాంక నివాసినీం శ్రీ కాత్యాయనీం త్వాం శరణం ప్రపద్యే.
కాత్యాయని మహాదేవి శంకరార్ధ స్వరూపిణి
కల్యాణం కురుమే దేవి శివశక్తి నమోస్తుతే .
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ధ్యానం సమర్పయామి. (ఎర్రటిపుష్పం అమ్మవారి ముందు వుంచవలెను.)
శ్లో: అస్మిన్ కలశోపరి సాంబ సదాశివ సహిత కాత్యాయనీం
మహా గౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి.
పుష్పాన్ని వుంచి ఈశ్వరుని ఎడమతొడపై కాత్యాయని దేవి కూర్చున్నట్లుగా భావించి నమస్కరించవలెను.
బంగారంతో కానీ, పసుపు కొమ్ములతో కానీ వారి శక్తానుసారముగా మంగళ సూత్రాలు కలశానికి అలంకరించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని నైవేద్యంగా సమర్పించాలి. ఏడు చెరుకు ముక్కలను (తొక్క తీసినవి) కూడా నైవేద్యంగా సమర్పించాలి.
ప్రార్ధన:
దేవ దేవి మహాదేవి శంకరార్ధ స్వరూపిణి
కాత్యాయని మహాదేవి కైలాసాచల వాసిని
తవపూజా భక్తి యుక్త చేతసాహం సదాముదా
కరిష్యామి తవప్రీత్యై మమాభీష్టం ద్రుతం కురు
గ్రహదోశాది దుర్దోశాన్ క్షిప్రం నాశయ శాంభవి
కల్యాణం కురుమే దేవి సౌభాగ్యంచ ప్రయశ్చమే .
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ప్రార్ధన నమస్కారాన్ సమర్పయామి.
అని పుష్పముగాని, అక్షతలుగాని అమ్మవారి ముందు వుంచి ఆమెను ప్రార్ధించ వలెను.
వ్రతము పూర్తి చేసిన తరువాత వ్రతకథ విని కథాక్షతలను అమ్మవారి మీద వుంచి తరువాత ఆ అక్షతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకుని ఆశీర్వాదము తీసికుని రాత్రి భోజనం చేయాలి. మంగళ వారాలు భక్తితో జరుపాలి. మధ్యలో ఏ వారమైన ఆటంకం కలిగితే ఆ పై వారం జరుపుకోవచ్చు. ఇలా ఏడు వారాలయ్యాక ఏడో మంగళవారం ఉద్యాపన జరుపుకోవాలి.
ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటి పోయాలి. అలా కాని వారు ఉదయం ముత్తైదువుల గృహాలకు వెళ్లి కుంకుడు కాయలు, పసుపు, తలస్నానానికి ఇచ్చి రావాలి. ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలు, ఏడు చెరుకు ముక్కలు, ఏడు రవికలు వాయనమిచ్చి (ఒక్కరికి చీర ఇచ్చి) వారిచే అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం పొందాలి. పగలు నిద్రపోకూడదు. చివరి వారంలో పుణ్యస్త్రీలకు దక్షిణ తాంబూలాదులతో కనీసం 7 కాత్యాయనీ వ్రత పుస్తకాలను సమర్పించాలి. ఆర్ధిక స్తోమత లేని వారు వ్రతం ఆచరించలేని వారు ఏడుగురు వివాహం కాని కన్యలకు ఏడు పుస్తకాలను యిస్తే చాలా మంచిది.