Nenu Mee Brahmanandam

నేను
మీ బ్రహ్మానందం

250.00

+ Rs.40/- For Handling and Shipping Charges
Share Now

Description

నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకందిoచటం ఎంతో ఆనందదాయకం. తానే చెప్పినట్టు ‘ఒకరి అనుభవం,మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు ,మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే  ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ  పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ పుస్తక  ప్రచురణ కర్తలయిన  ‘అన్వీక్షికి’ వారిని అభినందిస్తున్నాను!చిరంజీవి

——————-

అంతా దేవుడి దయ. అంతా ఆయనే. అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం ఇదంతా నా కష్టార్జితం. నా స్వయంకృషి. నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి! నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్ళినా, కాదు. .. నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం! అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకితభావంతో, నవ్యతతో చేయాలి… ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి… ఈ రెండూ కలిస్తేనే జీవితమనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పినా, మహ్మద్ ప్రవక్త చెప్పినా, జైనులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా ఒకటే చెప్పారు. “కష్టపడు … ఫలితాన్ని ఆశించకు” అని. నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడని తెలియ జేయడానికే నా ఈ పుస్తక రచన. అంతేగాని… నాకున్న కష్టాల్ని, నేను పడినటువంటి బాధల్నీ చెప్పుకుని నేను ఇంత తక్కువ వాడిననీ, బీదవాడిననీ, ఇంత దారుణమైన స్థితి నుంచి వచ్చాననీ మీ దగ్గర నుంచి జాలి పొందడానికి గానీ… లేదా నేను సాధించిన విజయాల్ని… నేను సాధించిన విజయసోపానాల్ని మీ ముందుంచి నేనింత గొప్పవాడిననీ చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయడం లేదు. –– బ్రహ్మానందం