Description
వేదాంత పంచదశి ( అద్వైత తత్త్వ విచారం – పదిహేను ప్రకరణాల వివరణ )
అద్వైత తత్త్వాన్ని బోధించే గ్రంథాలలో పంచదశి ప్రాశస్త్యమైనది. ఎల్లరకూ నిత్యం అనుభవంలో ఉండే ‘నేను’ అనే భావంతో మొదలుపెట్టి శ్రద్ధతో అభ్యాసం చేస్తే ప్రత్యగాత్మ అనుభవగతమవుతుంది. ఆ ‘నేను’ సమూలంగా నశిస్తే అదే అద్వైతం, లేశమాత్రమైనా మిగిలి ఉన్నప్పుడు ద్వైతంగా ప్రకటమవుతుంది. ఈ ప్రయాణంలో సాధకులకు సాధారణంగా ఎదురయ్యే సంశయాలను తగినంతగా చర్చిస్తూ గమ్యాన్ని, మార్గాన్నీ, ప్రయోజనాన్ని చక్కగా వివరించారు రచయిత. విద్వాంసుల్లో అగ్రగణ్యులైన విద్యారణ్యులు అద్వైత సిద్ధాంతానికీ, తదితర సిద్ధాంతాలకూ గల సంబంధాన్ని స్పష్టం చేసారు. విచార మార్గంలో పయనించే సాధకులకు ఇది సహాయకారిగా నిలిచి ఉంటుంది.