Ishwarya Yogam

ఐశ్వర్య యోగం

 

200.00

+ Rs.20/- For Handling and Shipping Charges
Share Now

Description

శ్వర్య యోగం –బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్

     ఇది కలియగం. ప్రతి జీవికి ఏదో ఒక కష్టం. ఎవ్వరికీ సమయం చాలదు. పూర్వం లాగా పూజలు చేయలేరు. గట్టిగా ప్రదక్షిణలు చేయలేరు. డబ్బు ఖర్చు పెట్టలేరు. ఉపవాసాలు సరేసరి. ఎవ్వరిని చూసినా మనోధైర్యం లేనివారే. మరి ఈ జీవులను ఎలా రక్షించాలి? వీరికి దిక్కెవరు? అని నేనొక రోజంతా అమ్మను ధ్యానించాను. అమ్మ దర్శనం ఇచ్చింది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి నామానికి తేట తెనుగులో వివరణ ఇచ్చి, ఏ నామాన్ని ఎంత, ఎలా జపిస్తే ఏయే ఫలితాలు వస్తాయో లోకానికి అందించమని చిరునవ్వు ముఖంతో ఆజ్ఞాపించింది. అదే సమయంలో ‘భక్తి’ టి.వి. వారు సాధనలో మంత్ర బలాన్ని గూర్చి చెప్పమని కోరగా, ఈ నామాలకు వివరణ, ప్రయోగం, ఫలితం గూర్చి వివరించేవాడిని. వాటిని చూసి, విని ఎందరో తరించారు. ‘వార్త’ పత్రికలో పనిచేస్తున్న శ్రీ వరిగొండ కాశీవిశ్వేశ్వరరావుగారు ‘వార్త’ దినపత్రికలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని, ప్రతి నామానికి వ్యాఖ్య వ్రాయమని, మంత్ర ప్రయోగం ఫలితం అందించమని, రోజూ ఒక్కొక్క నామాన్ని ‘వార్త’లో వేస్తానని కోరగా వారి కోసం ఈ నామాలు వ్యాఖ్య వ్రాశాను. ఈ నామ వ్యాఖ్యాన విశేషాలను ”ఐశ్వర్యయోగ” నామంతో భక్తులకు అందించటానికి సంకల్పించాను. ఈ మంత్రాలు జపించి అందరూ ఇహపరాలు పొందండి. తొందరలో సహస్ర నామాలూ ముద్రణకు నోచుకోవాలని అమ్మవారి అనుగ్రహం లభించాలని ఆశిస్తున్నాను. వీటిని జపిస్తే సంపదలు,ముక్తి లభిస్తాయి. కనీసం వీటిని చదివినా, సకలసళిలిఖ్యాలు లభిస్తాయి. బ్రహ్మాండ పురాణంలో ఈ సహస్రనామాలు ఉన్నాయని అంటాం కానీ, ఈ నామాలలోనే భువన బ్రహ్మాండలన్నీ ఉన్నాయి. వీటి మాధుర్యం, మహిమ నేను నిత్యం అనుభవిస్తూనే ఉన్నాను. ఇంకెందుకాలస్యం మీరంతా కూడ వీటిలో ఓలలాడండి. తరించండి – బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్