Devi Navarathrulu – Chaganti books

144.00

Share Now

Description

దేవీ నవరాత్రులు Devi Navarathrulu

free sample

శరన్నవరాత్రులు శరద్ ఋతువు నందు మనం జరుపుకునే నవరాత్రులు కనుక ఆ పేరు వచ్చింది. ఆ నవరాత్రులకు ఖ్యాతి, పవిత్రత దేనివల్ల కలిగాయి? శరదృతువు నందు నల్లటి మేఘాలు ఉండవు. దూదిపింజలలా తెల్లటి మేఘాలు ఆకాశమంతా ఆవరించి అత్యంతవేగంగా వెళ్ళిపోతుంటాయి. జగత్తుకి మేఘ స్వరూపం చెయ్యవలసిన ఉపకారం శ్రావణ, భాద్రపద మాసాలలో విశేషమైన వర్షాలు పడటమనే రూపంలో పూర్తయిపోతుంది. తమ దగ్గర ఉన్నదంతా వర్షించి వెళ్ళిపోతున్న మేఘాలను చూసి ఒక నమస్కారం చేస్తాం. మీదంతా మాకిచ్చి మా అభ్యున్నతిని అపేక్షించి మేం కృతజ్ఞత చెప్పామా, చెప్పలేదా? అన్నది కూడా చూసుకోకుండా, ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగి చల్లటి నీటిని మాయందు వర్షించి మీరు నిరాధారమైన ఆకాశంలో వెళ్ళిపోతున్నారు.