Description
దేవీం స్మరామి – దుర్గే ప్రసీద
– పురాణపండ శ్రీనివాస్
శ్రీ దేవీ నవరాత్రోత్సవాలో భక్తులపాలిట కొంగుబంగారాలుగా ‘ మోహన్
పబ్లికేషన్స్ ‘ రెండు అపురూప గ్రంధాలను వెలువరించింది. మొదటిది ‘ దేవీం
స్మరామి ‘ దివ్యగ్రంధం కాగా, రెండవది ‘ దుర్గే ప్రసీద ‘ పవిత్ర
గ్రంధం.
కేవలం శరన్నవరాత్రులలో అర్చన, పారాయణకే కాకుండా కలకాలం ఉపయోగపడే రీతిలో
ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వీటిని రచన సంకలనం చేశారు.
హాయిగా మనతో కూడా తీసుకెళ్లే విధంగా పాకెట్ సైజ్ లో అద్భుతంగా ప్రచురించబడిన
ఈ వొక్కొక్క పుస్తకం 128పేజీలతో మనకు దర్శనమిస్తుంది. అమ్మ భక్తులకు ఈ
రెండు గ్రంధాలూ రూ. 25/- ల కే లభ్యమవుతాయి.
చూడచక్కని ఈ పుస్తకాలే మీకు అమ్మ అనుగ్రహంగా లభిస్తాయి.
Search Tags: Devi Navaratrulu, Dussehra