Deeparadhana Mahima

దీపారాధన మహిమ

Thotapalli BalaKrishna Sharma

450.00

Share Now

Description

Deeparadhana Mahathyam

”దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌!
దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యా దీపం నమోస్తుతే!”

దీపం వెలిగించినప్పుడు నమస్కరిస్తూ పఠించాల్సిన శ్లోకం ఇది. అజ్ఞా నాంధకారాన్ని తొలగించి, సకలాభీష్టాలను సిద్ధింపజేసే పరబ్రహ్మ స్వరూపమైన ఆ దివ్య పరంజ్యోతికి నమస్కారము అని భావము.
భౌతిక, ఆధ్యాత్మిక కాంతి వికాసానికి, మోక్ష పథ సాధనకు దీపారాధన చేస్తారు. దీపశిఖలో నీలం, పసుపు, తెల్లని రంగులు కన్పిస్తాయి. ఆ మూడు రంగులు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలని పురాణోక్తి. దీపా రాధన చేయడం వలన ఆ ముగ్గురు జగన్మాతలను, త్రిమూర్తులను కూడా పూజించినట్లవుతుంది.
ఉదయం, సాయంత్రం గృహాలలో, దేవాలయాలలో దీపారాధన చేయ డం మన దేశంలో అనూచానంగా పాటించబడుతున్న సంప్రదాయం. ఇంటి లో రెండు పూటలా దీపారాధన చేయడం ఐశ్వర్యదాయ కం అవుతుందం టున్నాయి ధార్మిక గ్రంథాలు. దైవ సన్నిధిగా భావింపబడే పూజాగృహంలో దీపం వెలిగించి, నిర్మలమైన మనస్సుతో దైవధ్యానం చేసి, పండో, పటికబెల్లమో దైవానికి నివేదించి, ప్రసాదంగా పంచు తారు. ప్రకాశ స్వరూపులైన దేవతలు దీపారాధన చేసే వారి పట్ల ప్రసన్నత చెంది, సంతోషంతో సన్నిహితులవుతారని ఋషి వాక్కు. భర్తృహరి తన శతకంలో పరమేశ్వ రుని జ్ఞానదీపం అని వర్ణించాడు. దీపం వెలిగించబడిన చోట లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుందని, ఆ ఇంటిలో కాంతి, శోభలు కొలువై ఉంటాయని భక్తుల విశ్వాసం. ఇంటి ఆవరణలో, ముఖ్యంగా తులసికోట వద్ద దీపం వెలిగిస్తే మన పూర్వీకులు జ్యోతిర్మయమైన ఆనంద లోకంలో సంతోషంగా ఉంటారని, ఐశ్వర్యాధి దేవత మన ఇంట కొలువై ఉంటుందని, దీపదర్శనం వలన చెడు భావనలు మనసులో కలుగవు అని పెద్దలంటారు.
”ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం
దీపం దాస్యామి తే దేవీ గృహాణ ముదితాభవ!”
అని ప్రార్థిస్తాము. ఓ దేవీ! నేతితో తడిపిన వత్తులు కలది, చీకటిని తొలగిం చునది అయిన దీపాన్ని నీకు సమర్పిస్తున్నాను. స్వీకరించి సంతృప్తి చెందుము అని భావము. తేజ: తత్త్వానికి ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తాము. కనుకనే ఆ ప్రక్రియను దీపారాధన అన్నారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆత్మస్వరూపం కూడా. దీపం వెలిగించగానే ఆ ప్రదేశమంతా దైవీ శక్తులతో నిండిపోతుందట. ప్రమిదలో సాధారణంగా ఆవునెయ్యి లేక నువ్వుల నూనె వేసి, రెండు వత్తులను కలిపి, ఆ తైలంలో తడిపి, దీపం వెలిగించి, గంధం, కుంకుమలతో ప్రమిదను అలంకరించి, పూలు సమర్పించి పూజచేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఈ ‘దీపారాధన’ మహిమ వలన గ్రహ దోషాలు తొలగి, ఇల్లు కాంతివంతంగా, సుఖసంతోషాలతో విలసిల్లుతుంది అని నమ్మ కం. దీపం వెలిగించడం ఐశ్వర్యానికి, జ్ఞాన వికాసానికి హేతువవుతుంది.
పరమేశ్వర చైతన్యం సృష్టిల ో ఒక్కటే అయినప్పటికీ అది వివిధ శక్తులుగా వ్యక్తమవుతుంది. దీపం వెలిగించడానికి వాడబడే ప్రమి ద, వత్తి, నూనెలు విభిన్న దేవతారూపాలైన శక్తులు. దీపం వెలిగించబడి, ఆరా ధింపబడినప్పు డు ఆ దేవ శక్తులు జాగృ తమై, మన మనసులు ప్రశాంతత పొందడంతోబాటు, ఆత్మజ్యోతి చైతన్య వంతం కావడానికి దోహదపడు తుంది. దీపాన్ని జ్యోతి అని కూడా అంటారు. ఈ జ్యోతులు ఆధి భౌతిక, ఆధి దైవిక, ఆధ్మాత్మ జ్యోతు లు అని మూడు రకాలుగా పెద్దలు అభివర్ణించారు. ఆధి భౌతిక దీపాలు లాంత ర్లు, విద్యుద్దీపం, ప్రమిదలలో వెలిగింపబడే దీపం. ఇవి మన భౌతిక ప్రపం చంలోని చీకటిని పోగొట్టేవి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినప్పుడు, మనం వెలిగించిన దీపాలు మలిగినప్పుడు, పగలు, రాత్రి వెలిగే సూర్యచంద్రులే మనకు ఆధి దైవిక దీపాలు. ఏ కారణం వలననైనా దీపం, సూర్యచంద్రులు లేనప్పుడు నక్షత్రాలే జ్యోతులు. ఇవి దేవతా సంబంధమైన ఆధి దైవిక జ్యోతు లు. మన దేహానికి సంబంధించిన కన్నులు, ఇంద్రియాలు, ఆత్మ, మనస్సు, బుద్ధి ఆధ్యాత్మిక జ్యోతులని అన్నారు. ఇంద్రియాలను మనస్సు అనే జ్యోతి వెలిగిస్తే, మనసును బుద్ధి, బుద్ధిని ప్రకాశపరచే జ్యోతి ఆత్మ అని భావించాలి.
బృహదారణ్యకంలో ఈ జ్యోతులను గురించి జనక యాజ్ఞవల్క్య సంభా షణలో (4-3-2) ఇలా ఉంది. ”యాజ్ఞవల్క్యా, ఈ పురుషునికి జ్యోతి ఏది?” ”ఆదిత్యుడే జ్యోతి” అని సమాధానం. ఆదిత్యుని వెలుగు వలననే ఇతడు వ్యవ హరిస్తున్నాడు. సరే, మరి ఆదిత్యుడు అస్తమించినప్పుడు? చంద్రుడే దీపం. సూర్యచంద్రులు కనిపించని సమయంలో? అగ్నియే. మరి అగ్ని ఆరిపోతే? వాక్కు దీపం అవుతుంది. చీకటిలో ఎదుటివారి మాటలను బట్టి అనుసరి స్తాడు. ఆదిత్యాదులు, వాక్కులేనప్పడో? అప్పుడు ఆత్మయే జ్యోతి. ఆత్మ అనే వెలుతురులో వ్యవహారం సాగించబడుతుంది.
ఒకమారు ఆదిశంకరాచార్యులు ఒక కుష్ఠు రోగిని చూసారట. అతనిని సమీపించి శంకరులు ”కిం జ్యోతిన్తవ?” అని అడిగారు. ”నీకు దీపం ఏది?” అని. ఆ రోగి ”భానుమానహనియే రాత్రౌ ప్రదీపాదకంస్యాత్‌” అన్నాడట. అం టే నాకు పగలు సూర్యుడు, రాత్రి దీపములే జ్యోతులు అని. మరలా శంకరులు ”ఏవం రవి దీప దర్శన విధౌకిం జ్యోతి రాఖ్యాహిమే?” అని అడిగారు. సూర్యు ణ్ణి, దీపాన్ని చూచేటప్పుడు నీకు జ్యోతి ఏది? అప్పుడా రోగి ”చక్షు:”(కన్ను) అని సమాధానం చెప్పాడట. మళ్ళీ శంకరులు ”తస్య నిమీల నది సమయే కిమ్‌?” అని అడిగారు. అంటే కళ్ళు మూసుకొనినప్పుడు నీకు దీపమేది?” అని. రోగి ”థీ:” (బుద్ధి) అన్నాడు. ”థియ: దర్శనే కిమ్‌?” అని శంకరులు అడిగారు. అంటే గాఢనిద్రలో ఉన్నప్పుడు, బుద్ధి పనిచేయనప్పుడు జ్యోతి ఏది అని. అప్పుడా రోగి ”అహం పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో” అన్నాడు. ఆ బుద్ధి కూ డా లేనప్పుడు నేనే శ్రేష్ఠమైన జ్యోతిని అని అర్థం. ఈ సంఘటనలు ఆధ్యాత్మ జ్యోతి అనే దీపారాధన జరిగినప్పుడు మనో నేత్రం తేజోమయమైన పర మాత్మ అనే జ్యోతిని, అంటే పరం జ్యోతిని, దర్శించగలుగుతుంది అనే సందే శాన్నిస్తాయి. ఆత్మ జ్యోతిని వెలిగిం చే ఇంధనము జ్ఞానము. దీనికి వేరే ప్రమిద, నూనె, వత్తి, దేశ కాలాలు అవసరంలేదు. ఆ దివ్యజ్యోతిని ఆరాధించగలిగే శక్తిని సాధనతో సంపాదించుకోగ లిగితే అదే నిజమైన దీపారాధన అవుతుందని పెద్దల మాట.