Trailanga Swami

శ్రీ త్రైలింగ స్వామి 
జీవితం – ఉపదేశములు

198.00

Share Now

Description

మహాత్మా శ్రీ త్రైలింగ స్వామి జీవిత ఉపదేశములు

“”సిద్ధయోగ పుంగవులు, మహాతపస్సంపన్నులు, పరమశివావతారులు, కుంభక యోగి, దిగంబర మౌనముని, అద్వైతసిధ్ధి జ్ఞాననిష్టులు మహాత్మా శ్రీ త్రైలింగ స్వామి వారు””….
ఆయన పుట్టింది ‘తెలుగునేల’ లో అయినా, ఆయన గడిపిన కాలమంతా పరమేశ్వరుని హృదయస్ధానమైన శాశ్వత ముక్తి ధామం “కాశీ” లోనే. ఆయన చూపించిన మహిమలు అపారం. వారు పొందిన తపోసిద్దులనేకం. వారి దివ్య విభూతి అనంతం. ఆయనే “త్రైలింగ స్వామి (దిగంబర గణపతి స్వామి)”. అసలు పేరు శివ రామయ్య (శివరాం). ‘భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస’ చే “వారణాసిలో నడయాడే విశ్వనాధుడు (Walking Shiva of Benaras)” గా ఆయన ప్రకటించబడినారు.
స్వామి వారు ‘శివుడి అవతారం’ గా చెప్పబడ్డారు. స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు. తన తల్లి చెప్పే శివకధలు, రామాయణ, మహాభారతాలు మొదలైన సనాతన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు. ఆయన తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపారు. అప్పుడు తన తల్లి మరణించగా గురువును వెదుకుతూ ఇల్లు వదలిపెట్టి వెళ్ళిపోయాడు.తన సాధనను తన ఊరి శ్మశానంలో ప్రారంభించాడు.తర్వాత అతను నేపాల్ తో సహా చాలా ప్రదేశాలు తిరిగి చివరికి కాశి చేరుకొని అక్కడ సుమారు 150 సంవత్సరాలు పైన ఉన్నారు.
స్వామివారు కేవలం ఆకులూ అలములు,పండ్లుఫలాలు తిని సంవత్సరానికి ఒక పౌండు చొప్పున పెరిగి 300 పౌండ్ల బరువుకి పెరిగినట్టు చెపుతారు. స్వామివారు ఎన్నోవిషపూరిత ద్రవాలు త్రాగికూడా ఎటువంటి తేడా లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. వేలాదిప్రజల సాక్షిగా రోజుల తరబడి గంగానది పై తేలుతూ ఉండేవారు. ఒక్కొక్క సారి నీటిపై కూర్చుని ప్రజలకు కనిపించేవారు. ఒక్కొక్కసారి నీటిలోపల, అలలక్రింద రోజుల తరబడి ఉండిపొయేవాడు. వేసవికాలం లో మిట్టమధ్యాహ్నం మణికర్ణికాఘాట్ లో ఎర్రగా కాలే ఇసుక పై స్వామి పడుకోవడం స్వామికి ఏమీకాకుండా ఉండటం చూడటం అక్కడి ప్రజలకు అలవాటే. స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు జరిగాయి. స్వామివారు పుష్యశుక్లఏకాదశి నాడు (డిసెంబర్ 1881) నాడు సమాధి పొందారు. వీరి సమాధి కాశి లో “పంచగంగ ఘాట్” లో ఉంది. Trailinga Swami