Sri Matangi Sadhana

శ్రీ మాతంగీ సాధన

 

99.00

Share Now

Description

Sri Matangi Sadhana | mathangi
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 120

శ్రీ మాతంగీ సాధన

కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.

మరకతశ్యామ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి దశమహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య. వశీకరణదేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాస శుక్లపక్ష తృతీయా తిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్ఛిష్టచండాలి అనే పేర్లతో ఈ దేవిని వ్యవహరిస్తారు. ఈ దివ్య స్వరూపిణి ఉపాసన వల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణ శక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

శ్రీ మాతంగీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీ మాతంగీ దేవి గురించి, వివిధ రకాలైన మాతంగీ మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీ మాతంగీ అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాను.

నమస్కారాలతో….

– డా. జయంతి చక్రవర్తి