Sri Guru Tantram

శ్రీ గురు తంత్రం

Author: Swami Madhusudana Saraswati

150.00

Share Now

Description

Sri Guru Tantram Book

శ్రీ గురు తంత్రం

Author: Swami Madhusudana Saraswati

కేవలం సద్గురువే జీవన పూర్ణత్వ ప్రాప్తిలో సహాయం చేయగలడు. జీవన జనన మరణ చక్రం నుండి, ఈ పద్మవ్యూహం నుండి మిమ్మల్ని రక్షించగలడు. ఇలా రక్షించగల సమర్థుడే సద్గురువు.

కానీ ఇటువంటి సద్గురువు లభించడం ఎలా? ఒకవేళ మీకు ఎవరో ఒక వ్యక్తి ప్రత్యేక మంత్రదీక్ష ఇచ్చాడనుకోండి … మరి ఆయన సమర్థుడు అవునో కాదో తెలుసుకోటం ఎలా?

అసలు అలా తెలుసుకోటానికి ప్రయత్నించవచ్చా? ఒకవేళ ఆయన సమర్థుడు కాదు అని తేలితో ఆయనను మార్చుకోవచ్చా? ఈ సందేహాలన్నింటికీ రామబాణంలాంటి సమాధానం ఒకటి ఉన్నది. అది ఒక తంత్రసాధన. దాన్ని సద్గురుదర్శన ప్రయోగం అంటారు.

ఎవరు గురువు?ఏది చదువు?
విద్యార్థికి ఈ సమాజం అంతా గురువే. తెలియని విషయాలు చెప్పేవారందరూ గురువులే. చేపలు పట్టే వ్యక్తి కూడా ఏకాగ్రత విషయంలో గురువే అని వివరిస్తుంది మహాభాగవతంలోని అవధూత ఉపాఖ్యానం. సమాజం నుంచి సమగ్రమైన విజ్ఞానం లభిస్తుంది. మనసు వికసిస్తుంది. తుదిగా ఆ సమాజంపై గౌరవం ఏర్పడుతుంది.
గమ్యం తెలియని జీవన గమనానికి దారి చూపే దీపం చదువు. విద్యార్థి జీవితం సజావుగా సాగేందుకు ఆ దీపాన్ని భద్రంగా పట్టుకొని ఉండే జ్ఞానాధారం గురువు. విద్యార్జన మహాయాగం వంటిది. దానిని నిర్వహించే బ్రహ్మ గురువు. ఆయన అనుగ్రహం విద్యార్థిని జ్ఞానవంతుడిని చేస్తుంది. విద్యార్థి చదువు గురువుతో ఉండే అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. గురుశిష్యుల సంబంధం గురించి, సమాజహితాన్ని కోరే చదువు గురించి మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే..
తమ చిన్నారికి మూడో యేడు వచ్చిందో లేదో తల్లిదండ్రులకు ఆరాటం. ఎప్పుడెప్పుడు అక్షరస్వీకారం చేయిస్తామో.. ఎప్పుడెప్పుడు బడికి పంపిస్తామో అని. మన సంప్రదాయంలో పిల్లలను బడిలో వేయడం కూడా ఒక సంబరమే. పప్పు బెల్లాలు, పలకాబలపాలు తోటి పిల్లలకు పంచిపెట్టి.. తమ పిల్లలతో ఓనమాలు దిద్దిస్తారు. ఆనందంగా మొదలయ్యే విద్యార్థి జీవితం ఓ మధురానుభూతి. చదువంటే ఓ సంతోషం, ఓ ఆనందం. బడికి పోవాలనే ఒకటే ఆరాటం. ఎలాంటి ఒత్తిడి లేకుండా, హాయిగా చదువుకోవడం తొలినాళ్ల నుంచి మన విద్యావ్యవస్థలో కనిపిస్తుంది. అప్పుడే పునాది గట్టిగా ఉంటుంది. దానిపై భవిష్యత్‌ బంగారుమేడ గట్టిగా నిలవగలుగుతుంది.
మనిద్దరం కలిసి..
విద్యార్థి జీవితం గురువుపైనే ఆధారపడి ఉంటుంది. గురుశిష్యుల బంధం ఎంత బలంగా ఉంటే.. ఆ విద్యార్థి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. సనాతన విద్యావిధానం గురుశిష్యుల సంబంధాన్ని చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సారాంశం కేనోపనిషత్తు శాంతి మంత్రంలో కనిపిస్తుంది.
‘‘ఓం సహనావవతు, సహనౌభునక్తు..
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః’’