Description
ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. ఇది స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి, సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి.
ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మహామంత్రం.
దీనిలో ప్రతి శ్లోకానికిఇవ్వబడిన యంత్రాలను విధి విధానంగా ఎవరు అర్చించినా ఫలితం తద్యం. సందేహం లేదు.
నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన ‘ఆత్మనివేదన’ ఈ శ్లోకాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ‘భవానిత్వం దాసే’ (శ్లోకం-22) విపంచ్యా గాయంతీం (శ్లోకం 95) వంటి మహామాన్విత శ్లోకాల ఫలశృతి ఇంతింత అని చెప్పడం సాధ్యం కాదు.
లలితా సహస్రనామావళి వ్యాఖ్య పునాదిగా-అనుష్టాన విద్య ఆలంబనగా అంబను నిత్యం ఉపాసించే శ్రీ పంచ యజ్ఞం అగ్ని హోత్రావధనులచే ఈ విశిష్ట గ్రంథానికి వ్యఖ్యానం సంకలించి పెట్టవలిసిందిగా అభ్యర్దించగా వారికి మాపట్లగల అవ్యాజానురాగం చేత అది ఈ ఆకృతిని దాల్చింది.
ఈ విశేష విశిష్ట గ్రంథాన్ని సమాదరించి, మా కృషికి సార్ధకత చేకూర్చగలరని ఆశిస్తూ…… -శ్రీ పంచయజ్ఞం అగ్నిహోత్రావధానులు.