Muhurtam Nirnayinchadam Ela?

63.00

ముహూర్తం నిర్ణయించడం ఎలా? 


మరిన్ని పుస్తకాలకై

Category:

Muhurtam Nirnayinchadam Ela? Book

ముహూర్తం నిర్ణయించడం ఎలా? 

మూఢం అంటే ఏమిటి? ఆ సమయంలో శుభముహూర్తాలు ఉండవు ఎందుకు?
– మాధవి, సూర్యాపేట
ఏదైనా గ్రహంతో సూర్యుడు కలిసి ఉన్నప్పుడు ఆ గ్రహం అస్తంగతం అవుతుంది. అంటే ఆ సమయంలో భూమి నుంచి చూస్తే ఆ గ్రహం కనిపించదన్నమాట! అలాగే గురు, శుక్రులు సూర్యుడితో కలిసి ఉన్న సమయంలో అస్తంగతం అవుతారు. దీనినే మూఢం అంటారు. గురువుతో రవి కలిసి ఉన్న సమయాన్ని గురు మూఢమనీ, శుక్రుడితో కలిసి ఉన్న కాలాన్ని శుక్ర మూఢమనీ అంటారు. మిగిలిన గ్రహాలన్నీ సూర్యుడితో కలిసినపుడు అస్తంగతం అవుతాయి తప్ప.. వాటికి మూఢం ఉండదు. కేవలం గురు, శుక్రులకు మాత్రమే మూఢం వర్తిస్తుంది. ఏ శుభకార్యానికైనా ముహూర్త నిర్ణయంలో గురు, శుక్రులే ప్రధాన పాత్ర వహిస్తారు కాబట్టి, వీటి ప్రభావం అంతగా ప్రసరించని మూఢకాలం శుభకార్యాలకు అంతగా యోగ్యం కాదని శాస్త్రం తెలియజేస్తుంది.
– మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి