Description
Mantra Yantra Shakti
మంత్ర యంత్ర శక్తి
వేదాలు ఆద్యాత్మికమగు శాస్త్రములు, జ్యోతిష్యశాస్త్రముననుసరించి ఏర్పరచబడినవి మంత్రములు, యంత్రములు. మనసు ఇంద్రియములు శారీర తత్వములను అనుసరించి ఆయుర్వేదానుసరముగా చెప్పబడినట్టివి తంత్రములు వీటన్నిటికి అవినాభావ సంబంధం కలదు. ఇది తేలీక అనేకులు దేశీయ వైద్య విధానాన్ని మంత్ర తంత్ర యంత్ర విధానాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. చేసి చూస్తేనే ఫలితం తెలియగలదు. చేయకుండా ఫలితం లేదనుట విచారించదగ్గ విషయం.
ఈ మంత్ర తంత్ర యంత్రములనేవి నిరాధారములని ఎలాంటి ప్రామాణికం లేదనుకోవడం పొరబాటు. ఇవన్నియు శాస్త్రాల ఆధారంగానే చెప్పబడినవి. ఎందరో మహానుభావులు సిద్ద పురుషులు ఋషులు మానవ కళ్యాణం కోసం ఎంతో కృషి చేసి ఆవిష్కరించిన అద్భుతాలివి. వాటిని అనుసరించి చూచువారికే మహిమ తెలియగలదు. ఎన్నో మంత్ర తంత్ర యంత్ర విధానాలు ఈ పుస్తకంలో వివరించబడ్డాయి. -సదానందయోగి.