Kokkokam | Kala Shastram

కొక్కోకము | కళాశాస్త్రం
కొక్కోకుడు (మూలం)
పద్యానువాదం.కూచిరాజు ఎఱ్ఱన

ప్రతికి యధాతదం

400.00

Share Now

Description

కొక్కోక శాస్త్రం గురించి వివరంగా చెప్పాలంటే పెద్ద గ్రంథమే అయిపోతుంది . కాబట్టి టూకీగా. .

కొక్కోక శాస్త్రం పేరు సంస్కృతంలో రతిరహస్య ; ఆంగ్లంలో సీక్రెట్స్ ఆఫ్ లవ్. ఇదే కోకా శాస్త్రం కూడా. కొక్కోక అనే కవిపండితుడి రచన ఈ కామకళా శాస్తం. దీన్ని మధ్యయుగ భారతీయ సెక్స్ మాన్యువల్ గా కూడా పరిగణిస్తారు. ఈ మాన్యువల్ సంస్కృతంలో ఉంది. కోకా పండితుడి మీద పలురకాల గాధలు ప్రచారంలో ఉన్నాయి . కొక్కోకం రచనా కాలం ఇతమిత్థమని ఇంత వరకూ నిర్ధారణ అయింది కాదు. కానీ ఇది 11 లేదా 12వ శతాబ్దంలో రాసివుంటారని ఒక అంచనా. వైన్యదత్తు అనే రాజును సంతృప్తి పరిచేందుకు రచించనది ఈ రతిరహస్య గ్రంధం. “ధేనువుల పాలుపితికి మధించి వెన్ననెత్తిట్టులనే దేవేంద్రుడు మొదలగు దేవతల చేత స్తుతింపతగిన స్త్రీభోగసౌఖ్యకరములైన వైన్యదత్తుని వాక్యార్థములను గ్రహించి యీకవిచే ప్రకాశింపజేయదగిన యీశాస్త్రమును కవివరులంగీకరింతురుగాక. “అంటూ స్వయంగా కొక్కోకుడు ఈ గ్రంధంలో ఒక చోట చెప్పుకొచ్చాడు.

రతిరహస్యంలో పదిహేను పరిచ్ఛేదాలు (అధ్యాయాలు), 800 శ్లోకాలు ఉన్నాయి, ఇవి వివిధ శరీరాకృతులు, చాంద్రమానం , వివిధ రకాలైన జననాంగాలు , వివిధ వయసుల స్త్రీల లక్షణాలు, కౌగిలింతలు , ముద్దులు , లైంగిక సంపర్కం , లింగ భంగిమలు , శృంగారం వంటి వైవిధ్య అంశాలకు సంబంధించినవి . కొక్కోకం రతిరహస్యంలోని శృంగార దశలను విపులంగా వివరిస్తుంది , బరువు తగ్గడం , మూర్ఛపోవడం , ఆఖరి దశ మరణం దాకా శృంగార దశలు అన్నీ అరటి పండు వలచి చేతిలో పెట్టినట్లే వర్ణిస్తుంది. రతిరహస్యం స్త్రీలను జాతుల కింద వర్గీకరిస్తుంది. స్త్రీల సులభ ఉద్రేకానికి దారితీసే కామోద్దీపన కేంద్రాలను, ఉత్తేజ పరిచే రోజులను కూడా వివరిస్తుంది.

వాత్సాయనుడి ‘కామసూత్రం’ లో కనిపించే విధంగానే రతిరహస్యం భారతీయ స్త్రీ సౌందర్యాన్ని సమ్మోహనకరంగా వర్ణిస్తుంది. ఈశాస్త్రం రూపురేఖలు, శారీరక లక్షణాల ప్రకారం స్త్రీలను నాలుగు మానసిక-భౌతిక రకాలుగా వర్గీకరించింది.

1. పద్మిని (కమల స్త్రీ)

మెత్తని శరీరం, పరిమళ రతిజలం,, మారేడు రంగు కుచద్వయం, సొగసు చూపు, సంపెంగ ముక్కు, గురుబ్రాహ్మణపూజల మీద ఆసక్తి, , కలువపూపు దేహచ్ఛాయ, తామర రేకువంటి భగం, హంసగమనం , సన్నటి కటి , మంచిమాట, శుచీ రుచీ గల భోజనం , తెల్లచీరెల మీద ప్రీతి ఇత్యాది పద్మినీ జాతి స్త్రీ లక్షణాలు .

2. చిత్రిని (కళా మహిళ)

సన్నటి నడుము, మంచి అతిశయం , కోపదృష్టి, ఘనమైన జఘన సంపద, దడ్డు చనులు, బలమైన పిక్కలు , కొద్దిపాటి పెద్ద పెదవులు, తేనె వాసన రతిజలం, మూడు రేఖలున్న కంఠమాను, వెన్నెల పులుగుపలుకులు, ఆటపాటల మీదాసక్తి నేర్పు, మృదువు యోని, ఆలింగచుంబనాదుల మీద ఆసక్తి, చపలదృష్టి, పులుసు రుచి మీద ప్రీతి, తగుపాటిభోజనంతో తృప్తి , వన్నె చీరెల మీద కన్ను, సున్నితమైన మనసు చిత్రినిజాతి స్త్రీ లక్షణాలు.

3. శంఖిని (శంఖు స్త్రీ)

ధృఢమైన దేహం, అతి కోప దృష్టి, ఎరుపు రంగు పూలు, దుస్తుల మీద ప్రేమ, అదిరే పెదవులు, రోమపూరిత భగము, ఘాటు వాసనగల రతిజలం, రతి సమయంలో మదన జలం పూట, నఖ క్షతముల యందు సుఖ భావన, మితమైన భోజనం, కాక శరీరం, కొండెములు వినటం, గార్దభ స్వరం, పైత్యగుణం, వంకర మాటలు– శంఖినీ జాతి స్త్రీ లక్షణాలు.

4. హస్తిని (ఏనుగు స్త్రీ)

నిలకడ లేని నడక, పొడవైన కాలివేళ్ళూ చేతివేళ్ళూ , కురచ కంఠం, పసుపు రంగు వెంట్రుకలు, చెడు పనులు, పొట్టి దేహం, ఏనుగు మదం వాసన గల రతిజలం, ఉప్పుకారాలు ఎక్కువగా వున్న ఆహారం, బండ పెదవులు , విటుల మీద వాంఛ, తడబడే మాట, మంచి మనసు, లోతు వెడల్పులెక్కువగా వున్న భగం, మొరటు రతి తృప్తి, కోపిష్టి స్వభావం హస్తినీజాతి స్త్రీ లక్షణాలు.

కామోద్దీపన సాధనాల వివరాలు కూడా ఈ గ్రంథంలో సాకల్యంగా వివరించబడ్డాయి.

డబ్ల్యూ . జి ఆర్చర్ ప్రకారం , కొక్కోకం “శృంగార భావనలను ఎలా ఎక్కువగా ఉపయోగించుకోవాలి, ఎలా అమితంగా ఆస్వాదించాలి, స్త్రీని ఎలా సంతోషపెట్టాలి తదితర కామ సంబంధిత విశేషాలను విడమరిచి మరీ చర్చిస్తుంది. కొక్కోక పండితుడు ఈశాస్త్ర రచనకు ప్రధానంగా , నందికేశ్వర , గోణికపుత్ర , వాత్సాయన .. వంటి అనేక ఇతర శృంగారరస కర్తలపై ఆధారపడ్డట్లు రుజువులున్నాయి .

ఈ కామకళా శాస్త్రం అరబిక్ , పర్షియన్ , టర్కిష్ అనువాదాల పేరు ‘ లజ్జత్ ఉన్ నిసా’ . ‘ది జాయ్ ఆఫ్ సెక్స్ ‘ ఆంగ్ల రూప కర్త అలెక్స్ కంఫర్ట్ . 1964లో ఈ కోక శాస్త్రం, ‘బీయింగ్ ది రతిరహస్య ఆఫ్ కొక్కోక అండ్ అదర్ మెడీవల్ ఇండియన్ రైటింగ్స్ ఆన్ లవ్ (లండన్: జార్జ్ అలెన్, అన్‌విన్) అనే పేరుతో ఆంగ్లంలో అనువాదం చేయబడింది . కొక్కోక పండితుడి కోకశాస్త్రం ‘రతి రహస్య’ పేరుతో SC ఉపాధ్యాయ మరో ఆంగ్ల అనువాదం సృష్టించారు. ఈ గ్రంథంపైన అవన రామ చంద్ర , కవి ప్రభు , హరిహర లు కొన్ని గొప్ప వ్యాఖ్యానాలు రచించారు . ఇది ఇప్పటికీ భారతదేశంలో శాస్త్రీయ ప్రసిద్ధ గ్రంథంగా పరిగణింపబడుతున్నది. సెక్స్ మాన్యువల్స్‌లో కామసూత్రం తర్వాత రెండవ స్థానంలో కనిపించేది కొక్కోక శాస్త్రమే.

“తన కసాధ్యమైన తరుణిసాధించుట

దొరకెనేని తన్ను మఱపుఁగొనుట

మేలుగలుగు సతుల మెలపంగ నేర్చుట

కామశాస్త్రమునకుఁ గలుగుఫలము” అంటూ గ్రంథ ప్రయోజనాన్ని గూర్చి కొక్కోక కవే స్వయంగా వివరించాడు మొదటి పరిచ్ఛేదంలో,

Kokkoshamu: Prachina Kamashastra Visheshalu