Karkataka Lagnam

కర్కాటక లగ్నం
Author: Pucha Srinivasa Rao
Pages: 164

99.00

Share Now

Description

Karkataka Lagnam Book

Author: Pucha Srinivasa Rao
Pages: 164
ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును. రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.
రాశీ చక్రంలో నాల్గవరాశిగా చెప్పుకొనేది కర్కాటకం. మిథునరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 90 – 120 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. ఈ రాశిలో పునర్వసు 1, పుష్యమి 4, ఆశ్రేష 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం జూలై 17 – ఆగష్ట్ 16 మధ్యలో పుట్టిన వారు కర్కాటకరాశి జాతకులుగా చెప్పబడ్డారు.
మీరు కర్కాటక లగ్నం, కర్కాటకరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1. ఇంటిపట్టునే ఉండడానికి ఇష్టపడేవారైతే,
2. మనస్సులో ఉన్నది దాచుకోలేని వారైతే,
3. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నవారైతే,
4. నమ్మదగినవారు, ఓదార్పు కోరుకునేవారైతే,
5. సంప్రదాయములపై ఇష్టం కలిగిన వారైతే,
6. విమర్శలు పడలేని వారు, చేయనివారైతే,
7. కళలపై మక్కువ కలిగినవారైతే
8. ప్రేమలు,ఆప్యాయతలు ఎక్కువయితే,
9. మంచి భోజనప్రియులైతే,
10. ఏదోదో ఊహించుకుని భాధపడేవారైతే.
మీరు తప్పకుండా కర్కాటక రాశివారే … ఇక పుస్తకం చదవండి….