Sri Dosa Gita

– Neti Suryanarayana Sarma

శ్రీ దోస గీత

150.00

Share Now

Description

 తీగనుంచి విడిపోయిన దోసకాయలా నేను అమృతత్వాన్ని పొందాలి అంటున్నది మృత్యుంజయ మంత్రం. వేదమంత్రాలలో కనబడే ఆ దోసకాయ మహత్యాన్ని గురించి సాక్షాత్తూ కృష్ణభగవానుడే సరదాగా చెబితే ఎలా ఉంటుందో వివరించే కథే శ్రీదోసగీత. నేతి సూర్యనారాయణశర్మ రచనలో పద్దెనిమిది కథల సమాహారంగా వెలువడిన ఈ కథల సంపుటిలో ప్రతి కథ చవులూరిస్తుంది. మనకు అనేక రుచులు మప్పుతుంది. అష్టవిధ శృంగార నాయికలను గురించి, నవరసాలను గురించి పాకశాస్త్ర పరంగా వర్ణించి మెప్పిస్తుంది. ముక్కు, చెవులు, గోళ్లు, కాలిచెప్పు, బాత్ సబ్బు వంటివాటిపై కూడా ఆసక్తిదాయకమైన కథలు దీనిలో ఉన్నాయి.
       శంకర విజయం నవలా రచనతో నేతి సూర్యనారాయణశర్మ పుస్తకరంగంలో తొలి విజయాన్ని నమోదు చేశారు. తదుపరి శంకరుల శివానందలహరి, విష్ణుసహస్రనామ స్తోత్ర భాష్యం తేటతెలుగులో అందించారు. శర్మ రచనలో కాకర్త్య గుండన, మొగలాయి దర్బార్ నవలలు మార్కెట్లో ఉన్నాయి.

Telugu Kathalu