Description
చిట్టి చిట్కాలు
Pages : 88
చిట్టి చిట్కాలు’ పేరుతో స్త్రీల కోసం ఒక పుస్తకాన్ని మన ముందుకు తెస్తున్నారు. ఇందులో బ్యూటీకి సూత్రాలు, మిలమిలలాడే కనులకోసం, అభ్యంగన స్నానంతో అందం, స్వెక్టర్లను ఉతికే విధానం, పాదాల సౌందర్యం, చెప్పులుంచే చోటు, వేసవిలో ఇంటిని అందంగా ఆహ్లాదంగా ఉంచుకోవడం ఎలా, ఫ్రిజ్ వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆకులతో వైద్యం, మీరు స్లిమ్‌గా వుండలంటే ఏం చేయాలి?, సన్‌ఫ్లవర్ ఆయిల్, ప్రశాంత జీవితం కోసం ఏం చేయాలి?, రకరకాలుగా వస్త్రధారణ, అందంకోసం వదులుకోవలసిన అలవాట్లు, నష్టాలు, అందమైన గోళ్ళుకోసం, రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే , వంటగది జాగ్రత్తలు, మేకప్ జాగ్రత్తలు, వేసవిలో పిల్లలకు దాహం తీర్చడం…. లాంటి అనేక విషయాలు వివరంగా చిట్కాల రూపంలో తెలుపబడినవి.
ఇంట్లో ఫ్రిజ్ ఉంటే ఆ సౌలభ్యమే వేరు. పండ్లను, కూరగాయలను, ఇతర పదార్థాలను అందులో పెట్టేస్తే రెండు, మూడు రోజులైనా తాజాగా ఉంటాయి. ఒకసారి కొని తెచ్చి, ఫ్రిజ్‌లో పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు బయటకు తీసి వాడుకోవచ్చు. అందువల్లే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ కనిపిస్తోంది. కానీ చాలా మందికి ఫ్రిజ్‌లో ఏవి పెట్టాలో, ఏవి పెట్టకూడదో తెలియదు. తీరా అవి పాడైతే ఎందుకు పాడయ్యాయో అర్థం కాక, విక్రేతలను తిడుతుంటారు. ఇది సరికాదు. అందువల్ల ఫ్రిజ్‌లో ఏవి పెట్టకూడదో ఒక్కసారి తెలుసుకుందాం..