Description
Bharathiya Sankhya Sastram book
భారతీయ సంఖ్యాశాస్త్రం
– ముదిగొండ గోపీ కృష్ణ
భారతీయ సంఖ్యాశాస్త్రం’ మీద సమగ్ర సమాచారంతో సాధికారికంగా వెలువడుతున్న మొదటి గ్రంథం ఇది. సంఖ్యాశాస్త్రం గురించి తెలుసుకోవాలనుకున్నవారికి న్యూమరాలజీ పట్ల అవగాహన ఉన్నవారికి సరైన దిశానిర్దేశం చేసే ఏకైక గ్రంథం ముదిగొండ గోపీకృష్ణ అందిస్తున్న ఈ భారతీయ సంఖ్యాశాస్త్రం. ఆయన పరిశోధనాసారాన్ని సరళమైన భాషలో అందరి అవగాహనకు అందేలా రాసిన ఈ గ్రంథం ప్రతీవారి జీవితాలకు ఒక కొత్త వెలుగును ప్రసాదిస్తుందని నా నమ్మకం!
– చొక్కాపు వెంకటరమణ , ప్రముఖ మెజీషియన్, వ్యక్తిత్వవిశ్లేష శిక్షక నిపుణులు
* * *
ఈ పుస్తకం ఒక పరిశోధనాగ్రంథమనిపిస్తుంది. అంతేకాదు, ఈ పుస్తకం సంఖ్యాశాస్త్ర భవిష్యత్ పరిశోధనకు ఒక మెట్టుగా భావిస్తున్నాను. ఈ శాస్త్ర అవగాహనకు ఇది ఒక తెర తెరిచిన నిలయమౌతుంది. చదివిన వారిని చక్కగా ప్రభావితం చేయగల గ్రంథమిది. ప్రజలకు దగ్గరగా సంఖ్యాశాస్త్రాన్ని వుంచాలని చెసిన ప్రయత్నం చాలా వరకు సఫలీకృతమైంది. అనేక ఉదాహరణలో, ఉదంతాలతో మనకున్న అనుమానాలను తొలగిస్తుంది. భూత భవిష్యత్ వర్తమానాలను మన కళ్ళముందు ఉంచడానికి చేసిన రచయిత ప్రయత్నం విజయవంతమైంది.
– డా. సి. ఎన్. గోపీనాధరెడ్డి , ఐ.పి.ఎస్, పూర్వపు ప్రిజన్స్ డైరక్టర్ జనరల్, ఆంధ్రపదేశ్, హైదరాబాదు