Annamayya Keerthanalu

అన్నమయ్య కీర్తనలు 

30.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

అన్నమయ్య కీర్తనలు 
భగవంతుడు గానప్రియుడు

నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ
మద్భక్తా యత్రగాయంతి తత్ర తిష్ఠామి నారదా

‘‘నారదా.. నేను వైకుంఠంలో ఉండను. యోగుల హృదయాల్లోనూ ఉండను. ఎక్కడ నా భక్తులు నా గానం చేస్తుంటారో అక్కడ తిష్ఠ వేసుకుని కూర్చుంటాను’’ ..ఆ త్రిలోక సంచారి నారదులవారితో సాక్షాత్తూ పరమాత్మ చెప్పిన మాటలివి. గానం అంటే ఆ భగవంతుడికి అంత ప్రియం. శ్రీమన్నారాయణుని ఆస్థాన గాయకులు ఇద్దరు. నారదుడు, తుంబురుడు. వారు త్రిలోకాలలో సంచరిస్తూనే సర్వవేళలా శ్రీవారి గుణగణాలని కీర్తిస్తుంటారు. భక్తాగ్రేసరుడు హనుమంతుడు నిరంతరం, రామనామం గానం చేస్తుంటాడు. వాల్మీకి శిక్షణలో లవకుశులు రామగానం నిరంతరం చేస్తుండేవారు. గోపికలందరూ ఆబాలగోపాలం కృష్ణుణ్ని గానం చేస్తూనే జీవించారు.

వాగ్గేయకారుడు అన్నమయ్య శ్రీవారి కీర్తనలు వేనవేలు రచించి గానం చేసి, చేస్తూనే శ్రీవారిలో లీనమయ్యాడు. త్యాగయ్య, పురందరదాసు, శ్యామాశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితారు, రామదాసు, మీరాబాయి, కబీరు, తులసీదాసు.. ఇలా ఎందరో భక్తశిఖామణులు పరమాత్మను చేరడానికి గానమార్గాన్నే ఎంచుకున్నారు. తాము పరవశులై, స్వామిని పరవశింపజేసి తరించారు. హరిదాసుల దినచర్యయే హరిగుణగానం. రాక్షసులు సైతం కావలసిన వరాలను పొందడానికి, తపః పూర్వక గానం చేసిన దాఖలాలున్నాయి. రావణ కృత శివతాండవ స్తోత్రం ఆ కోవలోనిదే. రావణాసురుడు తన ప్రేవులనే వీణాతంత్రులుగ చేసి (రుద్రవీణ) పాడి శివసాక్షాత్కారం పొందాడు.

www.devullu.com

‘‘శిశుర్వేతి పశుర్వేత్తి వేత్తిగానరాసం ఫణిః’’. పశువులు, పక్షులు పాములు, శిశువులూ ఇలా.. సృష్టిలో అన్ని జీవులనూ పరవశింపజేసే శక్తి సంగీతానికి ఉంది. భగవంతుడిపై అపారభక్తితో గానం చేయాలన్న ఆలోచన వచ్చి, గొంతెత్తితేచాలు, రాగం, లయ, సాహిత్యం వాటంతట అవే వస్తాయి. ఎన్ని కష్టాలెదురైనా ప్రహ్లాదుడు భగవంతుడి గానం మానలేదు. శిక్షలు భరించలేకపోయిన రామదాసు.. ‘సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకమూ’ అంటూ నిందాస్తుతి చేశాడు. మళ్లీ అంతలోనే.. ‘అబ్బ తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా, ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా’ అని వేడుకున్నాడు. భక్తితో గానం చేస్తే మనలోని అరిషడ్వర్గాలు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) తొలగిపోయి దేహమే దేవాలయంగా మారుతుంది. గానంతో సర్వ శరీరనాడులు ఉత్తేజితమవుతాయి. ‘కలౌ సంకీర్త కేశవం’ ఈ కలియుగంలో సంకీర్తననే భగవంతుడిని చేరే మార్గం. ప్రయాణ ప్రాంగణాల్లో, దేవాలయ ఆవరణల్లో భిక్షకులు, దివ్యాంగులు, రోగగ్రస్థులు హరినామ గానం చేస్తుండగా అన్నీ ఉన్నవారు అలసించనేల. గళం విప్పి ఆ హరిగానం చేద్దాం. తరిద్దాం.

– వేదాంతం జగన్నాథాచార్య,