Annamayya Keerthanalu

అన్నమయ్య కీర్తనలు 

30.00

Share Now

Description

annamayya keerthanalu book

అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము “అదివో”

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము “అదివో”

చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్నధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము “అదివో”

కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకలసంపదరూపమదివో
పావనములకెల్ల పావనమయము “అదివో”
64 కీర్తనలు book…………….