Vadhuvara Vivaha Maitri

వధూవర వివాహ మైత్రి 

108.00

Share Now

Description

Vadhuvara Vivaha Maitri Book

వధూవర వివాహ మైత్రి 

మూడనమ్మకాలు గల గండ నక్షత్రాలు

వివాహ పొంతనలకు జాతకం తీసుకోగానే అమ్మో అమ్మాయిది అశ్లేష నక్షత్రం అట అత్తగారికి గండం మాకు ఆ సంబంధం వద్దు అని వెంటనే చెప్పే మాటలు వింటుంటాం.

అశ్లేష, మూల, విశాఖ,మఖ, జ్యేష్ఠా ప్రతి 27 రోజులకు ఒకసారి మొత్తంమీద అయిదు రోజుల పాటు వుండే ఈ నక్షత్ర కాలంలో పుట్టిన ఆడవారు పెళ్లికి పనికిరారా? వారిని చేసుకోకూడదా?

శాస్త్రం ఇలా తప్పుడు మాటలు చెప్పిందా? అంటే శాస్త్రం పిచ్చిమాటలు ఎప్పుడూ చెప్పలేదు. అపోహలు, అపవాదులు సంఘంలో అధికంగా ప్రబలిన రోజులివి.

శాస్త్ర దూరమైన అంశాలు ఎన్నో మనం అధిక ప్రాచుర్యంలో చూస్తాం.

మూల నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మామగారు చనిపోతారని, మతాంత రంలో మొదటి పాదం మాత్రమే హానికరమని,2,3,4 పాదాలు శుభమని చెప్పటం జరిగింది.

ముహూర్త చింతామణిలో ‘మూలాంత్య పాద సార్పాద్య పాద ఔతమ్ శుభౌ’ అనగా మూల చివరి పాదము నందు అశ్లేష ప్రథమ పాదము నందు జన్మించిన దోషం కలిగించదు అని వున్నది.

అశ్లేష నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే అత్తగారు చనిపోతారని,మతాంతరంలో మొదటి పాదం మాత్రమే శుభమని,2,3,4 పాదాలు అశుభమని చెప్పటం జరిగింది.

జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే కోడలి యొక్క బావగారు అంటే ఇంటికి పెద్ద కుమారుడు చనిపోతారని,జ్యేష్టా నక్షత్రం అమ్మాయిని ఇంటిలో చిన్నవారికి ఇచ్చి చేయటం వలన బావగారికి గండము అని చెప్పబడినది.

అందువలన ఇంటిలో జ్యేష్ఠులకు ఇచ్చి చేస్తే ఇక బావగారు అనే అంశం ఉండదు కదా! అందువలన దోషం లేదు.

విశాఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే ఆఖరి మరిది చనిపోతాడని ,మతాంత రంలో మొదటి పాదం మాత్రమే హానికరమని,2,3,4 పాదాలు శుభమని చెప్పటం జరిగింది.

మతాంతరంలో ‘విశాఖా తులాయా యుక్తఃదేవరస శుభావహ’ అని వున్నది. తులలో వున్న విశాఖ అనగా విశాఖ 1,2,3 పాదాలు మరుదులకు శుభమే అని వున్నది.

మఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే ఇంట్లో ఎవరైన చనిపోవచ్చని …
ఇలా చాలా మూడ నమ్మకాలు ప్రతి వారి హృదయంలో పాతుకు పోయి ఉన్నాయి .

ఈ భయాల వల్ల భవిష్యత్తులో మీరు కూడ అంద విశ్వాసాలకు బలి కావచ్చును.

ఎలాగంటే మీరు కోరి మంచిదని నమ్మిన నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకున్నా ఆమెకు కలిగే శిశువు మూల,అశ్లేష,జ్యేష్ట,విశాఖ,మఖ నక్షత్రాలలో జన్మిస్తే మీరు ఆ శిశువుకి వివాహం భవిష్యత్తులో చేయగలరా?అప్పుడు శాస్త్రాన్ని నిందించి ప్రయోజనం ఉండదు.

ఒకరి జన్మ నక్షత్రాల వల్ల మరణాలు మరొకరికి సంభవించవు.నక్షత్రాలవల్ల జరిగితే మంచి జరుగుతుంది గాని చెడు జరగదు.

నక్షత్రాలపై మీకు ఏదైనా సంశయం ఉంటే అది వివాహం చేసుకున్న భార్యా భర్తలకే వర్తిస్తుంది కాని వారి తల్లితండ్రులకు,అక్క చెల్లెల్లకు,లేక అన్నదమ్ములకు వర్తించదు.

కాబట్టి మీరు ఏమాత్రం సంకోచం లేకుండా మిగిలిన విషయాలన్నింటికి పొంతన కుదిరితే మూడ నమ్మకాలను వదిలి వివాహం చేయవచ్చు.

జాతక పరిశీలనలో అన్ని విషయాలకు పొంతన కుదిరితే నక్షత్రం పేరు మీద అనవసరంగా భయానికి లోనై విద్యా,వినయం,వివేకం,గుణం,సాంప్రదాయం,సంస్కారం,రూపం గల వదువులను విసర్జింపక మీరు ఆ కన్యను కోడలిగా తెచ్చుకోవచ్చు.

జాతకం సంబంధం రాగానే మూలా నక్షత్రం,అశ్లేష నక్షత్రం అని సంబంధం వద్దు అని అప వాక్యములు పలకకుండా విచారణ చేయమని విజ్ఞప్తి.

శాస్త్రంలో ప్రతి అంశానికీ దోషం గురించి ప్రస్తావించిన గ్రంథంలో దోష పరిహారములు ప్రస్తావించలేదు. గ్రంథాలు అనేకం పరిశీలించిన తరువాత చేయవలసిన నిర్ణయాలు ఏమీ చదవకుండా చేయవద్దు అని సూచన.

‘‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠేబథ్నామి సుభగే త్వంజీవ శరదాం శతమ్’’

ఇది కల్యాణ మంత్రం. రెండు జీవితాలను ఒకటిగా చేసి ముడివేసేదే మాంగల్యం.