Description
Sri Shobhakrut Nama Samvatsara
Gantala Panchangamu 2023-24 Book
Sri Kanchi Kamakoti Peeta Asthana Sidhanti
శ్రీ కంచి కామకోటి పీఠ ఆస్థాన సిద్ధాంతి
శ్రీ శోభన నామ సంవత్సర
గంటల పంచాంగము (2023- 2024)
శాంతి రత్నాకరం అను ప్రత్యేక వివరణ, గ్రహారిష్ట శాన్తి ప్రత్యేక వ్యాసములతో…
శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞపీఠ
జగద్గురువుల ప్రత్యేక అనుగ్రహ శ్రీముఖములతో…
పలు వేద, ధర్మశాస్త్ర సంస్కృత వివరణలు, శాస్త్రీయమైన శుభాంశ యుక్తమగు అత్యధిక శుభముహూర్తములతో.. మరియూ
భారతదేశమంతటా ఉపయుక్తమగు అంశాలతో…
శ్రీ కాంచీ కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞపీఠ ఆస్థాన సిద్ధాన్తి గారి
శ్రీ శోభన సంవత్సర గంటల పంచాంగమ్
“శోభతే ఇతి శోభనా “
శుభములను, క్షేమములను, మంచిని కలిగించునది శోభన సంవత్సరము.
శోభన అను పదం సరి అయినది, కానీ లోకమున శోభకృత్ అను పదం కూడా వాడుతున్నారు, రెండునూ వాడవచ్చు, అర్థం ఏమీ మారదు, కానీ సంస్కృత వ్యాకరణ పండితులు మాత్రం శోభన అనే పదమే సరి అయినది అని కంచి సభలో నిర్ణయం చేయడం జరిగినది.
లోకమునందు అందరి ఈతిబాధలను తొలగించి శుభములు చేకూరువిధముగా ఇంద్ర, వరుణ, కుబేరాదిదేవతా పరివేష్టితమైన శిబికము అను పల్లకీలో సంతోషముగా లోకోపాకరమైన చర్చలు జరిపి శుభములు, క్షేమములను అందించు సహోజసుడు అను నామధేయం కలిగిన అగ్నిభగవానుడు అధిపతి అయిన శోభన సంవత్సరమునకు స్వాగతము చెబుతూ మీ పంచాంగకర్త – యల్.విజయసుబ్రహ్మణ్య సిద్ధాన్తి.
పంచాంగ ప్రకాశకులు – మోహన్ పబ్లికేషన్స్