Atma Vidya Vilasam Telugu

ఆత్మ విద్యా విలాసము

120.00

మరిన్ని Telugu Books కై
,
Tags: ,
Share Now

Description

శ్రీ గురుభ్యో నమః

ఆత్మ విద్యావిలాసము

వటతరు నికట నివాసం పటుతర విజ్ఞాన ముద్రితకరాబ్జమ్‌ |

కఞ్చన దేశిక మాద్యం కైవల్యానన్ద కన్దలం వన్దే || 1

తా || మఱ్ఱిచెట్టుకు చేరువగా జ్ఞానముద్రావిలసితమైన పాణిపద్మము గలవాడై – ఆదిముడైన గురువొకడు విరాజిల్లు చున్నాడు. కేవలానందమునకు మూలకందమైన ఆ గురువునకు బ్రణమిల్లు చున్నాను.

వివరము :

సంసారమే ఒక మఱ్ఱిచెట్టు. ఊడలతో మఱ్ఱివిస్తరించును. సంసారమును అట్టిదే. మఱ్ఱివలె దాని విస్తృతికిని అంతములేదు.

‘మఱ్ఱి’ అనునది సంసారమును సూచించు చాటుమాట. దానికి చేరువగా నున్న గురువు పరమాత్మయే; పరబ్రహ్మమే! పరబ్రహ్మ సన్నిధియందు మాయ ఈ విశ్వసృష్టిని సాగించుచున్నది.

”మహామాయే విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి” ||

– సౌందర్యలహరి.

పరబ్రహ్మమో! దానికి ఒక చలనము లేదు, దాని యందొక వికారము జనింపదు. అది నిత్య సత్య వస్తువు. కేవల జ్ఞానానందములే దాని రూపము.

అందుచేతనే – జ్ఞానముద్రతో విలసిల్లు పాణిపద్మము గలవాడనియు – కేవలానందమునకు మూలకందమైన వాడనియు విశేషణములు వాడబడెను. అట్టి ఆ పరబ్రహ్మమును గురువుగా లక్షించి – వానిని జేరుకొని – అద్వయ భావనతో మ్రొక్కిన వాడు విశ్వాతీతుడై ప్రకాశించును. ‘అతడే తానై’ అలరారును.

మాయకు అవ్వలదోచు ఈ గురుమూర్తియే దక్షిణా మూర్తి యని వినుతింపబడెను. ‘దక్షిణము’ అనగా మొదటిది. ‘ఉత్తరము’ అనగా తరువాతిది. మొదటిది పరమాత్మ. తరువాతిది ప్రకృతి, మాయ. మొదటిది మూర్తి యగుటచే ఆ పరమాత్మ దక్షిణామూర్తి.

జ్ఞానమే ఆయనరూపము. ఎచట నేజ్ఞానమున్నను అదెల్ల అటనుండి – ఆయననుండి వచ్చినదే ! జ్ఞానదాతయేకదా గురువు. అందుచే ఆ దక్షిణామూర్తి ఆదిమగురుమూర్తి. ఆయన కేవలానందమునకు మూలకందమైనవాడు. ‘ఆనన్దం బ్రహ్మేతి వ్యజానాత్‌’ – అని శ్రుతి పేర్కొనుచున్న విషయము యోగిజనులకు అనుభవసిద్ధమైనది.

ఇట్లు శ్రీసదాశివ బ్రహ్మేంద్ర సరస్వతులు – మాయా కార్యమైన ఈవిస్తృతసంసారమునకు మూలమందున్న జ్ఞానానందమయమైన పరబ్రహ్మమును పేర్కొని – దానినిగూర్చిన నమనమును – అభిముఖప్రవృత్తిని – ఫలితముగా అదే తానైయున్న ఏకత్వస్థితిని – నమస్ర్కియారూపమున గ్రంథారంభమున వెల్లడించి యున్నారు.

గ్రంథము ఆత్మవిద్యావిలాసము గ్రంథారంభమునందలి యీమంగళాచరణ శ్లోకము – గ్రంథములోని సర్వమైన విషయమునకును అద్దము పట్టుచుండుట విశేషము.