Ananga Rangam

అనంగ రంగం

198.00

మరిన్ని Telugu Books కై
,
Tags: , ,
Share Now

Description

భారతీయ కామశాస్త్రంలో ఒక ప్రముఖమైన రచన – అనంగరంగ. దీన్ని 16 వ శతాబ్దంలో కళ్యాణ మల్లుడు అనే కవి రచించాడు. ఈ కవి 1451 నుండి 1526 వరకూ న్యూఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించిన లోడి సామ్రాజ్యానికి చెందిన వాడు. అహ్మద్ ఖాన్ లోడి కుమారుడైన లాడ్ ఖాన్ కోసం అనంగరంగ గ్రంథాన్ని రచించాడు కళ్యాణ మల్లుడు. అనంగరంగ గ్రంథం వాత్సాయనుడు రచించిన కామసూత్ర గ్రంథంతో పోల్చబడుతుంది. 1885 లో ఈ గ్రంథాన్ని కామశాస్త్ర సొసైటీ అనువదించింది. ఇందులో స్వభావాలను బట్టి స్త్రీ జాతులు, శరీర ఆకృతిని బట్టి స్త్రీ పురుష జాతులు, ప్రాంతాలబట్టి స్త్రీల రకాలు, వశీకరణం, స్త్రీ పురుషుల్లో వివిధ గుర్తులు, బాహ్య, అంతరంగిక సంతోషాలు, వివాహ సంబంధమైన పంచాంగం మొదలైనవి ఉంటాయి.

మైనారిటీ నిండిన ప్రతీ భారతీయ స్త్రీ, పురుషుడు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం అనంగరంగ.. సుప్రసిద్ధ వాత్సాయనుడు రచించిన కామ శాస్త్రాన్ని పోలియుండే ఈ పుస్తకమును కల్యాణమల్లుడు రచించాడు.

శరీర ఆకృతిని బట్టి పద్మిని, చిత్రిణి, శంకిణి, హస్తిణి అను స్త్రీ జాతులను, యోని లోతులను బట్టి మృగ, వాదవ (అశ్విని), కరిణి అను స్త్రీ జాతులను; అంగము పొడవు బట్టి శశ (కుందేలు), అశ్వ, వృషభ అను పురుష జాతులను కళ్యాణమల్లుడు అద్భుతంగా వర్ణించాడు. పురుషులు స్త్రీలతో సంభోగించే పద్ధతులు – వేళలు, వయసు, ప్రాంతాల బట్టి స్త్రీల స్వభావాలు, శరీర ఆకృతిని బట్టి స్త్రీల స్వభావాలు కూడా రచించాడు. ఇవే కాకుండా మోహించే స్త్రీలను గుర్తించడం,, వివాహిత స్త్రీలు దారి తప్పడానికి గల కారణాలు, అసంతృప్తి చెందే స్త్రీలను గుర్తించడం, స్త్రీలు శృంగారంపై ఆసక్తి చూపే సందర్భాలు, యోని రకాలు, స్త్రీలను ఆకర్షించడానికి వశీకరణ విద్యలో పలు ఔషధాల తయారీలు ఇవ్వబడ్డాయి .

  • శరీర ఆకృతిని బట్టి స్త్రీలలో పద్మినీ, చిత్రిణీ, శంకిణీ, హస్తిణీ అను జాతులున్నవి.
  • ప్రతిపాద, ద్వితీయ, చతుర్థి, పంచమి అను తిధుల్లో పద్మిని స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.
  • సప్తమి, అష్టమి, దశమి, ద్వాదశి అను తిధుల్లో చిత్రిణి స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.
  • తృతీయ, సప్తమి, ఏకాదశి, త్రైయోదశి అను తిధుల్లో శంకిణి స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.
  • నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య అను తిధుల్లో హస్తిణి స్త్రీ తన మర్మాంగాలనుండి సంతృప్తి చెందుతుంది.
  • పద్మినీ స్త్రీ రాత్రి వేళల్లో రతికి ఇష్టపడదు. ఆమె సూర్య కమలము వలె పగటివేళల్లో భర్త బాలుడైనా సరే ఇష్టపడుతుంది.
  • చిత్రిణి, శంకిణీ స్త్రీలు రాత్రివేలల్లో రతికి ఇష్టపడుదురు.
  • సాయంత్రవేళ 3 నుండి 6 గంటల సమయంలో పద్మిని స్త్రీ రతిని ఆనందించును.
  • సాయంత్రం 6 నుండి 9 గంటల సమయంలో చిత్రిణి స్త్రీ రతిని ఆనందించును.
  • అర్ధరాత్రి 12 నుండి 3 గంటల సమయంలో శంకిణీ స్త్రీ రతిని ఆనందించును.
  • హస్తిణీ స్త్రీ అన్ని వేళలా రతిని ఆనందించును.