All posts by Mohan Publications

శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే

శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే
శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే. సాధారణంగా క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం లాంటివి మాత్రమే వింటుంటాం. ఇంకా చాలా రకాల పదార్థాలతో అభిషేకం చేయొచ్చు. ఒక్కో పదార్థంతో చేసే అభిషేకానికి ఒక్కోరకమైన పుణ్యఫలం దక్కుతుంది. అవేంటంటే… ఆవు పెరుగు – ఆరోగ్యంఆవు నెయ్యి – ఐశ్వర్యంచక్కెర – దుఃఖ నాశనంతేనె – తేజస్సు పెరుగుతుంది.చెరుకు రసం – ధనవృద్ధికొబ్బరి నీళ్లు – సంపదలు పెరుగుతాయి.విభూతి – పాపనాశనంపనీరు – పుత్ర లాభంపుష్పోదకం – భూలాభంబిల్వజలం – .

శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణ

శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణ
శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక – ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు.ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, .