శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే

శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే. సాధారణంగా క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం లాంటివి మాత్రమే వింటుంటాం. ఇంకా చాలా రకాల పదార్థాలతో అభిషేకం చేయొచ్చు. ఒక్కో పదార్థంతో చేసే అభిషేకానికి ఒక్కోరకమైన పుణ్యఫలం దక్కుతుంది. అవేంటంటే… 
ఆవు పెరుగు – ఆరోగ్యంఆవు నెయ్యి – ఐశ్వర్యంచక్కెర – దుఃఖ నాశనంతేనె – తేజస్సు పెరుగుతుంది.చెరుకు రసం – ధనవృద్ధికొబ్బరి నీళ్లు – సంపదలు పెరుగుతాయి.విభూతి – పాపనాశనంపనీరు – పుత్ర లాభంపుష్పోదకం – భూలాభంబిల్వజలం – భోగభాగ్యాలునువ్వుల నూనె – అపమృత్యు దోషాల నివారణసువర్ణోదకం – పేదరిక నివారణద్రాక్షరసం – పనులు నెరవేరుతాయి. ధనలాభం.ఖర్జూర జలం – సుఖ జీవనం, శత్రుహానినేరేడు పండ్ల రసం – కార్య జయం, వైరాగ్యంకస్తూరీ జలం – శత్రుభయాలు తొలగిపోతాయి. చక్రవర్తిత్వంసుగంధ జలం – పుత్ర లాభంగరిక నీరు (దూర్వోదకం) – పోయిన సొమ్ము లభిస్తుంది. రుద్రాక్ష జలం – ఐశ్వర్యంఅన్నం – రాజ్యం, ఆయుర్దాయం, సుఖ జీవనం, మోక్షంపసుపు నీరు – సౌభాగ్యాలు, సకల మంగళాలుమామిడి పండ్ల రసం – దీర్ఘవ్యాధి నివారణ

Share Now