Category Archives: articles

ఆయ్‌.. మా కుండ బిర్యానీ రుసి సూత్తారాండీ!

ఆయ్‌.. మా కుండ బిర్యానీ రుసి సూత్తారాండీ!
కుండబిర్యానీలు చాలా చోట్ల దొరుకుతున్నా… రావులపాలెం కుండబిర్యానీ రుచి ప్రత్యేకం. ప్రత్యేకమైన మసాలాలతో కుండల్లో వండే ఈ బిర్యానీ తెలుగు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్నాటక ప్రాంతాలకు వేడివేడి పార్శిల్‌గా చేరిపోతుందంటే నమ్ముతారా?… ఘుమఘుమలాడే బాస్మతీ రైస్‌, ఘాటెక్కించే మసాలాదినుసుల పేరుచెప్పగానే హైదరాబాద్‌ బిర్యానీనే చటుక్కున గుర్తొకొస్తుంది. కానీ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో కూడా రావులపాలెం కుండ బిర్యానీకి ఫ్యాన్స్‌ ఉన్నారని అంటున్నారు భాస్కరా హోటల్‌ నిర్వాహకులు. ‘‘ఆయ్‌! .

పెళ్లి లో ముత్తైదువులు హృదయానికి మంగళ సూత్రాన్ని ఎందుకు తాకిస్తారు

పెళ్లి లో ముత్తైదువులు హృదయానికి మంగళ సూత్రాన్ని ఎందుకు తాకిస్తారు
పెళ్ళిలో ప్రతీ ఆచారం అద్భుతం, పైగా ప్రతీ ఆచారం వెనుక ఎంతో అర్ధం ఉంటుంది. పెళ్ళిలో మాంగల్యధారణ సమయంలో మాంగల్యాన్ని కళ్యాణ వేదికలో ఉన్న ముత్తైదువుల అందరి మేడలలో తాకించిన తరువాత వరుని చేత వధువు మేడలో మాంగల్యధారణ చేయిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేయిస్తారంతే… ఎంత జాగ్రత్తగా వధూవరుల జాతకాలను చూపించినా, ప్రతినక్షత్రానికి ఒక గండకాలం ఉంటుంది. అలాంటి గండకాలం వస్తే? అన్నటువంటి విషయాన్ని కూడా ఏ .

స్త్రీలు ధరించే తాటంకాలు (చెవి దిద్దులు)

స్త్రీలు ధరించే తాటంకాలు (చెవి దిద్దులు)
స్త్రీలు ధరించే శుభప్రదమైన ఆభరణాలు, యితర వస్తువుల విషయంలో సరియైన శ్రద్ధ చూపాలి. సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఈ విషయంపై క్రింది శ్లోకాన్ని చెప్పారు. శ్లో||”సుధామప్యా స్వాద్య ప్రతి-భయ-జరామృత్యు-హరిణీం| విపన్యంతే విశ్వే విధి – శతమఖాద్యా దివిషదః |కరాలిం యత్‌ స్వేలం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటం క-మహిమా|| ” మహేశ్వరీ ! దేవతలంతా అమృతం త్రాగినా, జరా మృత్యువులను పొందుతున్నారు. అంతా ప్రళయంలోలయమవుతున్నారు. అయితే కాల కూటవిషాన్ని .

ఏ తిథినాడు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్యఫలం

ఏ తిథినాడు ఏ దేవతను  ఆరాధిస్తే ఎంతటి పుణ్యఫలం
 వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు ఏ తిథినాడు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్యఫలం కల్గుతుందనే విశేషాల గురించి భూదేవికి వివరించాడు.  తిథులలో మొదటిదైన పాడ్యమినాడు అగ్నిని పూజించాలి. విదియనాడు అశ్విని దేవతలను ఆరాధించాలి. అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమనిష్టలతో చేయడంవల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. తదియనాడు గౌరీదేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియనాడు జరిగినందువల్ల గౌరీదేవికి ఆ తిథి అంటే ఇష్టం. తదియనాడు గౌరీకళ్యాణం కథ .

పూజలు, వ్రతాలలో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు వాడరు?

పూజలు, వ్రతాలలో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు వాడరు?
ఉల్లి చేసిన మేలు తల్లయినా చేయదని సామెత. అయితే, హిందూ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు లేని సాత్వికమైన ఆహారాన్నే తీసుకోవాలన్న నిబంధన ఉంటుంది. పూజలు, వ్రతాలలోనే కాదు, ఆచారాలను నిష్టగా పాటించే వారు చాలామంది వెల్లుల్లి, ఉల్లి తదితర మసాలా పదార్థాలను తీసుకోరు. అసలు ఈ విధమైన సంప్రదాయం ఎందుకు వచ్చింది? పూర్వులు ప్రత్యేక సందర్భాలు, పర్వదినాలలో వీటిని తమ .

రావి చెట్టు ప్రాముఖ్యత

రావి చెట్టు ప్రాముఖ్యత
ప్రకృతిలో ఉన్న వృక్షరాజాలలో రావి చెట్టు ఒకటి. ఇది దేవతావృక్షంగా పేరు పొందింది. అతి ప్రాచీనమైన రుగ్వేద మంత్రాలలో కూడా రావిచెట్టు ప్రస్తావన కనిపిస్తుంది. వృక్షాలలో తాను అశ్వత్థ వృక్షాన్నని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడంటే రావిచెట్టు ఎంతటి విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హిందూ మతంలోనే కాదు, బౌద్ధ. జైన మతాలలో కూడా రావిచెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మహిమాన్వితమైన వృక్షంగా పేరు పొందింది. బుద్ధుడు రావి చెట్టు .

తనువు శుభ్రం మనసు భద్రం

తనువు శుభ్రం మనసు భద్రం
శుచి, శుభ్రత భౌతిక ప్రయోజనాల కోసమేనా?అది కేవలం శారీరక సంబంధమైన విషయమా? నిజానికి శుభ్రత ఒక ధర్మం. అది ఆడంబరం కాదు. ఆచారం అంతకన్నా కాదు. అదో అనంతమైన విజ్ఞానం. మనిషి నడతను తీర్చిదిద్దే సంస్కారం.శుభ్రత బాహ్యం, ఆంతరంగికం అని రెండు రకాలుగా ఉంటుంది. నిత్యం చేసే స్నానం బాహ్యశౌచాన్ని కలిగిస్తుంది. మనసులో ఉండే అజ్ఞానాన్ని సాధన ద్వారా దూరం చేసుకోవడం ఆంతరంగిక శౌచం అవుతుంది. బాహ్యశౌచం కన్నా .

సగోత్రీకులు ఎందుకని వివాహం చేసుకోరాదు?

గోత్రమంటే ‘గోశాల’ అని అర్థం. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ‘గోత్రము’ అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పదానికి అర్థం మారి, ఒక వంశం వారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి (ఋషి) పేరునే వారి గోత్రంగా పిలవడం మొదలైంది. ఒక గోత్రం వారంతా ఒకే వంశానికి చెందిన వారు కాకపోవచ్చు. ఒకే గోత్రపు .