Chinnarulaku Chirutillu Chitkalu

చిన్నారులకు చిరుతిళ్ళు చిట్కాలు 

30.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

చిన్నారులకు చిరుతిళ్ళు చిట్కాలు 

వానొచ్చినా చలి తిరిగినా జలుబు చేసినా జ్వరం వచ్చినా నోరు బాగోకున్నా పొట్ట మందంగా ఉన్నా… వేడివేడి సూప్‌ తాగుతుంటారు కొందరు. హోటల్‌కి వెళ్లినప్పుడు డిన్నర్‌ లేదా లంచ్‌కి ముందు కచ్చితంగా సూప్‌ తాగేవాళ్లు మరికొందరు. ఒకప్పుడు సంపన్న వర్గాల్లో మాత్రమే ఉండే ఈ అలవాటు, క్రమంగా అందరికీ ఒంటబట్టింది. ఈ నేపథ్యంలో అసలీ సూప్‌ ఏమిటో, ఎందుకు తాగాలో, ఆరోగ్యానికి ఎలా మంచిదో ఓసారి చూద్దాం..!
సూప్‌ అనగానే అబ్బా… ఆ గంజి ఎలా తాగుతారండీ బాబూ… అని నొసలు చిట్లించేవాళ్లూ లేకపోలేదు. నిజమే, అమ్మమ్మకాలం నాటి గంజినీళ్లే నేటి సూపునీళ్లు. ఒకప్పుడు తినడానికి ఏమీలేని పేదవాళ్లు కాసిని నూకల్లో నీళ్లు పోసి గంజిలా కాచుకుని తాగి కడుపు నింపుకునేవారు. సరిగ్గా ఈ కారణంతోనే అది కాస్తా మళ్లీ సూపు రూపంలో టేబుల్‌మీదకొచ్చింది. లంచ్‌, లేదా డిన్నర్‌కి ముందు కాస్త సూప్‌ తాగడం వల్ల పొట్ట కొంతమేరకు నిండుతుంది. దాంతో తరవాత మితంగా ఆహారం తీసుకుంటాం. అంటే- సూప్‌ అనేది పేదవాడికి ఆకలి తీరుస్తుంది. మరీ ఎక్కువ తినకుండా చేసి సంపన్నుల ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. కాబట్టి ఎవరు ఏ కారణంతో తీసుకున్నా సూప్‌ మంచిదే.
పాతకాలం నాటిదే!
ఒకప్పుడు జలుబు చేసినా జ్వరమొచ్చి అరగనట్లు అనిపించినా అమ్మమ్మలు మిరియాలు దట్టించిన రసం తాగమనేవారు. ఒక రకంగా అదీ సూపే. అటు చేదు నోటికి రుచిగానూ ఉంటుంది. ఇటు ఆ మిరియాల ఘాటు పొట్టనీ బాగుచేస్తుంది. అలాగే కందిపప్పు, టొమాటో, మునక్కాడ, దనియాలపొడి… ఇలా అన్నీ కలిపి చేసే రసం కూడా సూపులాంటిదే. ప్రాంతాన్ని బట్టి దీన్నే రకరకాలుగా చేస్తుంటారు. చలికాలంలో గుమ్మడి, సొరకాయ, టొమాటో, మునగ… వంటి కూరగాయలతో చేసే చారు తాగడం దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకలో ఉంది. ఇందులో కొబ్బరిపాలు, పప్పులు, ఇతర కూరగాయల ముక్కలు, మిరియాలు, లవంగాలు, చెక్క… వంటి మసాలా దినుసులనూ కలుపుతుంటారు. దానిమ్మ, మామిడి, పైనాపిల్‌, పుచ్చ… వంటి పండ్ల ముక్కలు కూడా వేస్తుంటారు కొందరు.