బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

బొట్టుని సంస్కృతంలో తిలకం అని అంటారు. నుదుటన బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయపు విశిష్ట లక్షణం. బొట్టు పెట్టుకున్న వాళ్ల ముఖం చూస్తూ ఉంటే, వారిలో తేజస్సు, వర్చస్సు, కళ తాండవిస్తుంది. 

అందుకనే బొట్టు లేని ముఖాన్ని చూడకూడదు అని సంప్రదాయాలు పాటించే పెద్దవారు అంటూ ఉంటారు. వైదిక కర్మలు ఆచరించేటప్పుడు నుదుటన తప్పకుండా తిలకధారణ చెయ్యాలని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. స్నానం దానం తపో హోమో దేవతా పితృకర్మచ తత్సర్యం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా బ్రాహ్మణాస్తిలకం కృత్వాకుర్యాత్సంధ్యాన్య తర్పణమ్!
అంటే, పుణ్యస్నానాలు చేసేటప్పుడు, దానం చేస్తున్నప్పుడు, తపస్సును ఆచరించేటప్పుడు, హోమం చేస్తున్నప్పుడు, దేవతార్చన చేసే సమయంలో, పితృకర్మలను ఆచరిస్తున్నప్పుడు తప్పనిసరిగా నుదుటన తిలకధారణ చెయ్యా లి. లేకపోతే ఎటువంటి ఫలితాలు రావు. అదేవిధంగా బ్రాహ్మణులు సంధ్యావందనాన్ని చేసేటప్పుడు, తర్పణాలను విడిచేటప్పుడు తప్పనిసరిగా తిలకాన్ని ధరించాలని అర్థం
———————-

     భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు అనాదిగా, భారత ప్రజల జీవన విధానంలో కలిసిపోయి ప్రయాణం చేస్తున్నాయి. ఈ సంప్రదాయాలలో, అత్యంత ముఖ్యమైనది, మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం. ఇది కేవలం ఆచారం కాదు, దీని వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.అవేంటో చూడండి…

1. శరీరం చల్ల బడుతుంది
కుంకుమ బొట్టు పెట్టుకోవడం కేవలం, పెళ్ళి జరిగింది అన్న దానికి చిహ్నం మాత్రమే కాదు. కుంకుమలో మీరు మీ పాపిడిలో పెట్టుకున్నప్పుడు, మీ శరీరాన్ని చల్లబరుస్తుంది.

2. లైంగిక కోరికలను పెంచుతుంది
మహిళలు కుంకుమ పెట్టుకోవడం వలన వారిలోని లైంగిక కోరికలు పెరుగుతాయి. దాని ద్వారా త్వరగా సంతానం కలుగుతుంది. అందుకే భర్త చనిపోయిన మహిళలు కుంకుమ పెట్టుకోరు.

3. మెదడును ఉత్సాహంగా ఉంచుతుంది
కుంకుమలో పసుపు, నిమ్మ ఉంటాయి. వీటితి ఉన్న కుంకుమను నుదిటిమీద పెట్టుకోవడం వలన, మెదడు లోని కణాలను ప్రేరేపితం చేస్తాయి.

4. ఏకాగ్రతను పెంచుతాయి
నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వలన, ఏకాగ్రత పెరుగుతుంది. నొసటి ప్రాంతంలో అన్ని నాడులు కేంద్రీకృతం అయ్యి ఉంటాయి. అక్కడ పెట్టు కోవడం వలన మీరు చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది

అందుకే ఓల్డ్ ఫ్యాషన్ అనుకోకుండా, అప్పుడప్పుడు నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకోడానికి ప్రయత్నించండి.

Share Now