చేసేపనేదైనా స్వచ్ఛంగా చేయాలనీ…..

చేసేపనేదైనా స్వచ్ఛంగా చేయాలనీ, ఇష్టంగా చేయాలనీ, సాయం అయినా త్యాగం అయినా సంపూర్ణంగా చేస్తేనే అర్థం ఉంటుందనీ చెబుతున్నాయి శాస్ర్తాలు. మనం ఎదుటివారిపై చేసేదానిలో అందుకున్న వారి మాట అటుంచి కనీసం మనకైనా ఆత్మతృప్తి కలుగకపోతే చేసిన దానికి అర్థం ఉంటుందా? మనసు పెట్టి మంచి ఆలోచనలతో చేసే చిన్నపాటి త్యాగం అయినా పరిపూర్ణమై వెలుగొందుతుంది. అదే ఆర్భాటం కోసమో, పుణ్యం అంతా సంపాదించుకోవాలనో, శాస్త్ర విధి కోసమో చేసే మహత్తర త్యాగాలైనా నిరర్థకమైపోతాయి. మన మనసే మనతో ఏకీభవించనప్పుడు ప్రపంచాన్ని సమాధాన పరచాలని ఆరాటపడటం అవివేకం కాక మరేమిటి? నిజమైన, నిర్మలమైన, తనదైన త్యాగమంటే ఏంటో సుస్పష్టంగా నిరూపిస్తుందీ కథ.

తృప్తిపడిన అతిథి మీరంతా చల్లగా ఉండండని దీవిస్తాడు. కానీ ఆకలితో ఆ కుటుంబం ఆనాటి రాత్రే మరణించి పరమపదం చేరుకున్నారు. వారి చేతి నుంచి అతిథికి వడ్డించేటప్పుడు కింద పడిన కొద్దిపాటి ఆహారపు తునకలపైన నేను పొర్లడం మూలంగా నా శరీరం సగం బంగారంగా మారింది. అదీ అసలు త్యాగమంటే. తనదైన త్యాగంతో తృప్తి పడిన కుటుంబం గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం నా ఈ సగం శరీరం. మిగతా నా సగం శరీరాన్ని అటువంటి త్యాగనిరతి ఉన్నచోట బంగారంగా మార్చుకుందామని నేను తిరగని చోటులేదు.

ఒ కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అధికారం చేతిలోకి తీసుకొని రాజ్యాన్ని సుభిక్షం చేసే క్రమంలో పాండవులు పేదవారందరికీ అవసరమైన వాటినీ, ధనాన్నీ, ఆహారపదార్థాలనూ చాలా భూరిగా త్యాగం చేయడం మొదలుపెట్టారు. ప్రజలంతా వారు చేస్తున్న త్యాగం గురించీ దానధర్మాల గురించి చెప్పుకోసాగారు. ప్రపంచంలో ఇంతటి త్యాగనిరతిని మునుపెన్నడూ చూడనే లేదనీ అబ్బురపడి పోతున్నారు. పాండవుల త్యాగనిరతిని చాటుతున్న వారంతా సంపూర్ణంగా తృప్తిపడినవారే. ఈ తతంగం అంతా ముగిసే సమయానికి అక్కడికి ఒక ముంగీస వచ్చింది. దాని సగం శరీరం బంగారుమయం కాగా మరో సగం మాత్రం మామూలు చర్మంతోనే ఉంది. అది అక్కడికి వచ్చీ రావడంతోనే వారు త్యాగం చేసిన ప్రదేశంలో అటునించి ఇటు, ఇటు నుంచి అటుబొర్లడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు అలా చేసిన ముంగీస, మీరందరూ అబద్ధాలు చెబుతున్నారు. ఎందుకంటే ఇదసలు స్వచ్ఛమైన త్యాగం కానేకాదని అంటుంది.

పాండవులంటారు. మాకున్న అత్యంత విలువైన వస్తువులనూ, ధనాన్నీ, బంగారాన్నీ, రత్నాలనూ చాలామంది పేదవారికై త్యాగం చేశాము దాంతో వారంతా ధనవంతులై సంతోషంగా ఉన్నారు. ఇదంతా చాలా గొప్పనైన త్యాగానికి నిదర్శనంగా చేయబడిందని ముంగీస వారితో ఇలా చెప్పుకొచ్చింది.ఒకానొక చిన్న గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉంది. వారు చాలా పేదవారు. పండితునిగా తనకు తెలిసన జ్ఞానాన్ని పంచుతూ, తద్వారా వచ్చే చాలా కొంత ధనంతో ఇంటిని నడిపే వాడా ఇంటిపెద్ద. కష్టతరమైన రోజులు ఎన్నో వారి జీవితాన్ని నింపేసాయి. ఒకనాడు వారికి తినడానికి కేవలం ఒక గోబిపువ్వు మాత్రమే దొరికింది. దాంతో దాన్నే ఆహారంగా వండుకొని నాలుగు భాగాలుగా చేసుకొని తినడానికి సిద్ధపడ్డారు వారంతా. తండ్రి తనవంతు ఆహారాన్ని సరిగ్గా నోట్లో పెట్టుకొనే సమయానికి వారి ఇంటికి అతిథి ఒకరు వస్తాడు. అతను తనవంతు ఆహారాన్ని అతిథికి వడ్డించి సాదరంగా తినమని అంటాడు. అతిథి కూడా పది రోజులుగా పస్తులుండటంతో ఆరాటంతో తండ్రి వంతు ఆహారాన్ని తినేసి అయ్యా మీరు ఇది నాకు పెట్టి నిద్రపోతున్న ఆకలిని పెంచారు.

మరికాస్త పెట్టండని అడుగుతాడు. అతని భార్య తనవంతు దాన్ని కూడా వడ్డించమనీ అంటుంది. భార్యగా, గృహస్థులుగా మన కర్తవ్యం అతిథిని ఆదరించడమనీ చెబుతుంది. దాన్నీ తినేసిన అతిథి ఇంకా ఆకలిగా ఉందనడంతో కొడుకూ, కోడలూ ఒక్కొక్కరిగా తమ వంతు ఆహారాన్నీ అతిథికి వడ్డిస్తారు. తృప్తిపడిన అతిథి మీరంతా చల్లగా ఉండండని దీవిస్తాడు. కానీ ఆకలితో ఆ కుటుంబం ఆనాటి రాత్రే మరణించి పరమపదం చేరుకున్నారు. వారి చేతి నుంచి అతిథికి వడ్డించేటప్పుడు కింద పడిన కొద్దిపాటి ఆహారపు తునకలపైన నేను పొర్లడం మూలంగా నా శరీరం సగం బంగారంగా మారింది. అదీ అసలు త్యాగమంటే. తనదైన త్యాగంతో తృప్తి పడిన కుటుంబం గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం నా ఈ సగం శరీరం. మిగతా నా సగం శరీరాన్ని అటువంటి త్యాగనిరతి ఉన్నచోట బంగారంగా మార్చుకుందామని నేను తిరగని చోటులేదు. కనీసం మీ నుంచైనా అటువంటి త్యాగాన్ని ఆశించిన నేను నిరాశ చెందాను అంటుంది ముంగీస.

త్యాగమనే గొప్ప ఉద్దేశ్యం కుటుంబ వారసత్వంగా మనకు లభించాలి. అది తనదైన స్వచ్ఛమైన త్యాగమై అలరాలాలి. అంతేకానీ, ప్రాయశ్చిత్త మాత్రంగానో, విధి పూర్వకంగానో చేసేది త్యాగమనిపించుకోదు. తనదైన త్యాగానికి మనిషి సిద్ధపడితే అంతకన్నా మహద్భాగ్యం మరొకటుండదు. -ప్రమద్వర

Share Now