Vastuguna Deepika

720.00

ధన్వంతరి త్రయోదశి


మరిన్ని పుస్తకాలకై

Category:

Vastuguna Deepika Book

వస్తుగుణ దీపిక

అధర్వణ వేదంలో వస్తుగుణ దీపిక (pharmacopoeia) – అంటే ఏయే పదార్ధాలకి ఏయే ఔషధ లక్షణాలు ఉన్నాయో సాధికార స్వరంతో ఉద్ఘాటించే  పుస్తకం  వస్తుగుణదీపిక.

‘వస్తుగుణ దీపిక’ అనే ఈ  పుస్తకములో వందలాది వస్తువుల గుణములు అవి శరీరముపై చూపించు ప్రభావములు, ఫలితములు అత్యంత సులభ శైలిలో సరళమైన భాషలో వివరింపబడినవి.
వెలగకాయ: ఇది వగరు, పులుపు, తీపి రుచుల్ని కలిగి ఉంటుంది. తింటే నాలుక బెరడు కట్టిపోతుంది. రుచి పుట్టిస్తుంది. గుండెకు, కడుపునకు మంచిది. దీని గుజ్జు రసాన్ని పుక్కిలిస్తే పళ్ళకు మంచిది. నోటిలోని చర్ది పొక్కులు, నోటి పూతా పోతాయి. అయితే కంఠం బొంగురుపోతుంది.
మునగ చిగుళ్ళు : లేత మునగ చిగుళ్ళను ప్రతి ఉదయం తినగలిగితే వాతం, పైత్యం, కఫాన్ని పోగొట్టుకోవచ్చు. నేత్ర వాతాన్ని కూడ పోగొట్టుకోవచ్చు.

వినాయక పత్రిలో ఔషధగుణాలు

  • మాచీ పత్రి (మాసుపత్రి, మాచిపత్రి)- నేత్రవ్యాధుల నివారణ.
  • బృహతీ పత్రం అంటే నేలమునగ లేక వాకుడాకు – మూలశంక, దగ్గు, మలబద్దకం నివారణ.
  • బిల్వ పత్రం దీనిని మారేడు అని కూడా అంటారు – మధుమేహం లేక చక్కెర వ్యాధి (షుగర్ వ్యాధి) నివారణ.
  • దూర్వాయుగ్మం అంటే జంట గరిక – మూత్రసంబంధ వ్యాధుల నివారణ.
  • దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు – మానసిక రోగ నివారణ.
  • బదరీ అంటే రేగు – బాలారిష్టం నివారణ.
  • అపామార్గం అంటే ఉత్తరేణి – దంత వ్యాధులు, చర్మవ్యాధుల నివారణ.
  • తులసి – వాంతులు, నులి పురుగులు, దగ్గు నివారణ.
  • చూత పత్రం అంటే మామిడి ఆకు – అతిసారం, చర్మవ్యాధి, కాలి గోళ్ళ పగుళ్ళు.
  • కరవీరం అంటే గన్నేరు – జ్వర తీవ్రతను తగ్గిస్తుంది.
  • విష్ణు క్రాంత – మేధో వికాసం, నరాల బలహీనతల నివారణ.
  • దాడిమీ అంటే దానిమ్మ పత్రం – దగ్గు, ఉబ్బసం, అజీర్తి నివారణ.
  • మరువక పత్రం అంటే మరువం – శరీర దుర్వాసన నివారణ.
  • దేవదారు- శ్వాశకోశ వ్యాధుల నివారణ.
  • సింధువారంటే వావిలి ఆకు – బాలింత వాతం, ఒంటి నొప్పుల నివారణ.
  • జాజి – నోటి దుర్వాసన నివారణ.
  • శమీ అంటే జమ్మి- కుష్టు, అవాంఛిత రోమాల నివారణ.
  • అశ్వత్థం అంటే రావి – శ్వాశ కోశ వ్యాధుల నివారణ.
  • అర్జున(మద్ది)- వ్రణాలు తగ్గటానికి.
  • అర్క అంటే జిల్లేడు- చర్మకాంతి కోసం.
  • నింబ అంటే నిమ్మ- నులి పురుగులు, చర్మరోగాల నివారణ.