Sri Lakshmi Nidhi

శ్రీ లక్ష్మినిధి
Pages : 200
– మైథిలీ వెంకటేశ్వరరావు

216.00

Share Now

Description

శ్రీ లక్ష్మినిధి
Pages : 200
– మైథిలీ వెంకటేశ్వరరావు

శ్రీ మహా లక్ష్మీ పూజల గురించి, ఇతర ఆధ్యాత్మిక అంశాల గురించి చక్కని సమాచారం అందిస్తున్నారు రచయిత ఈ పుస్తకంలో.

‘శ్రీమహాలక్ష్మి’ అనగా..

శ్రీమహాలక్ష్మి దేవిలో శ్రీ అంటే శోభ కలిగినది. ఇంకా కాంతిని గలిగినది. సకల విద్యలనూ ప్రసాదించేది. ‘లక్ష్మి’ అంటే సంపదలను ఇచ్చునదీ అని అర్థం. సంపదే సుఖాలకీ, కీర్తికీ మూలము.

ఆదిలక్ష్మికి ఏ రోజులన్న ప్రీతి?

శ్రీమహాలక్ష్మికి గురువారమన్న ప్రీతి. మార్గశిర మాసంలో గురువార పూజలు మరింత శ్రేషసమైనవి. ఆ రోజు పూజా మందిర ప్రదేశమును గోమయంతో అలికి, ముగ్గులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు కురియటం తథ్యం. మార్గశిర మాసంలో శుక్లదశమి గురువారం శ్రీమహాలక్ష్మి వ్రతమైన నుదశా వ్రతము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది.

పాలసముద్ర నివాసిని లక్ష్మీదేవికి ఏవి ప్రీతికరములు?

శ్రీమహాలక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రములూ, ఇంకా అనేక పువ్వులూ, గంధమూ, ధూపదీపములన్న ప్రీతి. అలాగే శ్రీమహాలక్ష్మి పూజానంతరం ప్రసాదాన్ని నలుగురికీ పంచాలి. అన్నింటికన్నా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మంచి మాటలు మాట్లాడటం.

ప్రతినిత్యం లక్ష్మీదేవికి నివేదించాల్సిన నైవేద్యాలు

శ్రీమహాలక్ష్మికి ప్రీతికరమైన నైవేద్యాలు. అన్నము పాయసము, సర్వఫలాలూ, గోవుపాలు, పెరుగు, వెన్నతో చేసిన పదార్థాలు, చెరకు రసం, గోధుమరవ్వతో చేసినవి. శ్రీమహాలక్ష్మి నివేదించే నైవేద్యాలుగా నూనెను ఉపయోగించి చేసే వాటిని పెట్టరాదు.

* * *

ఈ పుస్తకానికి అనుబంధంగా, జ్యోతిష్యాది సంఖ్యా శాస్త్రాల ఆధారంగా పుట్టిన తేదీ ప్రకారం, ప్రజల ప్రవర్తన, ఆలోచనలు, నడవడిక, ఆకస్మిక ధనలాభం, ధనం విషయంలో ప్రవర్తన, వ్యాపార అభివృద్ధి, ఆడంబరాలు, అలంకరణ విషయాలు, ఉన్నత స్థానం, డబ్బు రాక-పోక, కష్టించి ధనం సంపాదించేవారా, తెలివితేటలతో సంపదను సృష్టించేవారా అన్న అంశాల సమాచారం 32 పేజీలలో ఇవ్వబడింది.

Part 1

Part 2

Part 3

Part 4

Part 5

Part 6

Part 7

Part 8

Part 9

Part 10

 

Tags: LBD, Sri Lakshmi Nidhi, Sri Lakshmi Nidhi, Mydhili Venkateswara Rao, Maithili Venkateswara Rao, Spiritual, Traditions,
Hindu, Astrology, Pooja, Prayer, Lakshmi, Maha Lakshmi, Adhyatmikam, Devotional, Bhakti, Lakshmi Nidhi