Sri Lakshmi Narasimha Sahasranamam

శ్రీ లక్ష్మీ నరసింహ సహస్రనామ స్తోత్రం

27.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

శ్రీ లక్ష్మీ నరసింహ సహస్రనామ స్తోత్రం
ఋణ విమోచన నృసింహ స్తోత్రం
దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 1 ||
లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 2 ||
ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 3 ||
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 4 ||
సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 5 ||
ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 6 ||
క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 7 ||
వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 8 ||
య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || 9 ||
మమ దేహి కరావలంబం
నృసింహ జయంతి
Lakshmi Narasimha Sahasranamalu, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry,BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA,TANTRA,YANTRA,SAMMOHANA, RASIPALITALU, BHAKTI,LEELA, MANDARAM, granthanidhi, antaryam, BHAKTHI SONGS,BHAKTHI,LAGNA,PURANA,devotional, NOMULU,VRATHAMULU,POOJALU, traditional, hindu, SAHASRANAMAMULU,KAVACHAMULU,ASHTORAPUJA,KALASAPUJALU,KUJA, PRINTBOOKS, TELUGUBOOKS, DOSHA,DASAMAHAVIDYA,SADHANALU,MOHAN PUBLICATIONS,RAJAHMUNDRY BOOK STORE,BOOKS,DEVOTIONAL BOOKS,KALABHAIRAVA GURU, KALABHAIRAVA,RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI,FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION,PRINT BOOKS,E BOOKS,PDF BOOKS,FREE PDF BOOKS,freeebooks. pdf,BHAKTHI MANDARAM,GRANTHANIDHI,GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU,BHAKTIPUSTHAKALU,BHAKTHIPUSTHAKALU,pooja, chaganti, garikapatiహరి సర్వాంతర్యామి ఎక్కడ చూసినా ఆయన జాడే… ఏ రూపమైనా ఆయనదే… నరుడూ ఆయనే… సింహమూ ఆయనే… నారసింహమూ ఆయనే… తనను తాను నిరూపించుకోవడం మనకే కాదు భగవంతుడికీ ఉంటుంది… ప్రహ్లాదవరదుడిగా స్తంభం నుంచి ఆవిర్భవించినా… ఆదిశంకరులను రక్షించేందుకు అరణ్యంలో సింహగర్జనలు చేసినా అది సర్వకాలసర్వావస్థల్లోనూ తానున్నానని చాటిచెప్పేందుకే… తరచిచూస్తే… నృసింహావతారం మనకు ఎన్నో విషయాలు బోధపరుస్తుంది. ఆయన ఎంత ప్రచండమో… అంత ప్రసన్నం… ఎంత ఉగ్రమో… అంత సమగ్రం… ఎంత అద్భుతమో… అంత ఆహ్లాదం… హృదయాంతరాళాల్లో నుంచి మమ దేహి కరావలంబం అని పిలిస్తే చాలు ఆయనవచ్చి వాలిపోతాడు… ఎంతటి క్లిష్టసమస్యలనైనా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తాడు…
9 మూర్తులా…
నరసింహమూర్తి అనేక రూపాల్లో అర్చనలు అందుకుంటున్నాడు. పాంచరాత్రాగమంలో డెబ్భైకి పైగా నృసింహమూర్తుల ప్రస్తావన ఉంది. ఒక ప్రత్యేక కారణంతో ఆ రూపాన్ని ధరిస్తే దాన్ని వ్యూహం అంటారు. స్వామి కదలికలు, లీలావిశేషాలు, కూర్చున్న లేదా నిలుచున్న భంగిమను బట్టి, చేతుల్లోని ఆయుధాల బట్టి వివిధ మూర్తులు ఉంటాయి. నవ నారసింహవ్యూహాలు అనే తొమ్మిది ముఖ్య రూపాలను మన పురాణాలు పేర్కొంటున్నాయి.
1. ఉగ్ర నారసింహుడు
2. కృద్ధ నారసింహుడు
3. వీర నారసింహుడు
4. విలంబ నారసింహుడు
5. కోప నారసింహుడు
6. యోగ నారసింహుడు
7. అఘోర నారసింహుడు
8. సుదర్శన నారసింహుడు
9. లక్ష్మీ నారసింహుడు
అనేవి ఆ తొమ్మిది నారసింహ వ్యూహాలుఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రఖ్యాత క్షేత్రం అహోబిలంలో మరో నవ నారసింహమూర్తులు కనిపిస్తాయి.1. ఛత్రవట నారసింహుడు (మర్రిచెట్టు కింద కూర్చున్న స్వామి)
2. యోగానంద నారసింహుడు (యోగ నిష్ఠలో ఉండి బ్రహ్మను దీవించిన స్వామి)
3. కరంజ నారసింహుడు
4. ఊహానారసింహుడు
5. ఉగ్ర నారసింహుడు
6. క్రోధ నారసింహుడు
7. మాలోల నారసింహుడు (తన ఒడిలో లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకున్న రూపం)
8. జ్వాలా నారసింహుడు (హిరణ్య కశిపుడిని సంహరించేందుకు స్తంభం నుంచి వెలువడుతున్న అష్టభుజమూర్తి)
9. పావన నారసింహుడు (భరద్వాజమునిని పావనుడిగా దీవించిన మూర్తి)కరావలంబమ్‌ అంటే చేయూత అని అర్థం. ధర్మవిరుద్ధంగా ప్రవర్తించేవారిని ఎలాగైనా సరే ఎప్పుడైనా సరే ఏదో విధంగా శిక్షించి, ధర్మోద్ధరణ చేస్తాడు దేవదేవుడు. అలాగే తనను నమ్మి సంపూర్ణ విశ్వాసంతో జీవితం గడిపేవారిని కరావలంబాన్ని ఇచ్చి రక్షించి తీరతాడు. ఈ విషయాన్ని నిరూపించేదే జగద్గురు ఆదిశంకరాచార్య రచించిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. లక్ష్మీ సహితుడైన నరసింహస్వామిని నీ చేయూతతో గట్టెక్కించమని ఆర్తితో ప్రార్థించే భక్తుడి హృదయం ఈ స్తోత్రంలో ఆవిష్కృతమవుతుంది. అసలీ స్తోత్ర ఆవిర్భావ సందర్భం భక్తుడిపై భగవంతుడికి ఉండే వాత్సల్యాన్ని ప్రకటిస్తుంది. శంకరభగవత్పాదులు శిష్యులతో కలిసి దేశసంచారం చేస్తూ శ్రీశైలానికి వచ్చారు. కాపాలిక సంప్రదాయం విస్తృతంగా ఉన్న రోజులవి. ఉగ్రదేవతోపాసన, మనుషులను బలి ఇవ్వడంలాంటి అనాచారాలు అందులో ఉండేవి. ఓ రోజు ఆదిశంకరులు ఒంటరిగా ఉన్న సమయంలో మూర్ఖపు ఆలోచనతో ఉన్న ఓ కాపాలికుడు ఆయనను చంపాలనుకున్నాడు. కాపాలికుడు కత్తి ఎత్తగానే ఎక్కడో ఉన్న శంకరుల శిష్యుడైన పద్మపాదుడికి గురువు ఏదో ఆపదలో ఉన్నట్లు అనిపించి నృసింహ మంత్రాన్ని జపించాడు. ఈ లోగానే భగవానుడు నృసింహుని రూపంలో వచ్చి కాపాలికుడిని సంహరించాడు. అలా నృసింహస్వామి ప్రత్యక్షమైన సమయంలో ఆదిశంకరులు చేసిన స్తోత్రమే నృసింహ కరావలంబ స్తోత్రంగా చెబుతారు. స్తోత్రమంటే గొప్పగా స్తుతించడం. వీటిలో వర్ణనలుంటాయి. కరావలంబ స్తోత్రంలో ఉన్న శ్లోకాలలో స్వామి లీలావిశేషాల వర్ణనతో పాటు ఓ గొప్ప ఆధ్యాత్మిక చింతనా ధోరణి కూడా కనిపిస్తుంది.
‘‘పాలసముద్రంలో నివసించే ఓ స్వామీ! ఓ చక్రధరుడా! ఆదిశేషుడి పడగలపై ఉండే రత్నకాంతులతో ప్రకాశించే దివ్యదేహుడా! యోగులకు ప్రభువైనవాడా! శాశ్వతుడా! సంసారసాగరాన్ని దాటించే నావలాంటి వాడా! లక్ష్మీదేవితో కూడిన ఓ నరసింహమూర్తీ నాకు చేయూతనివ్వు!’’
‘‘బ్రహ్మేంద్రరుద్రులు, వాయుదేవుడు, సూర్యుడులాంటి దేవతలంతా నీ పాదాలకు నమస్కరిస్తుంటే ఆ దేవతల కిరీటాల కాంతితో నీ పాదపద్మాలు ప్రకాశిస్తుంటాయి. ఓ లక్ష్మీనృసింహస్వామీ నాకు చేయూతనివ్వు!’’ అనేది మొదటి రెండు శ్లోకాల్లో కనింపిచే నామస్తుతి. ఇవి భగవంతుడి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతాయి. ఆ తర్వాత వచ్చే శ్లోకాల్లో మనిషికి కావాల్సిన జీవనయాన మార్గదర్శకాల్లాంటి అంశాలు కనిపిస్తాయి. పునరపి జననం, పునరపి మరణం… కాబట్టి చావు పుట్టుకల చక్రంలో పడి కొట్టుకోక మోక్షం కోసం ప్రయత్నించమనే సందేశం కనిపిస్తుంది.‘సంసారఘోర గహనే చరతో మురారే
మారోగ్ర భీకర మృగ ప్రవరార్ధితస్య!
ఆర్తస్య మత్సర నిదాఘని పీడితస్య
లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలంబమ్‌!’ఓ స్వామీ! ఘోరమైన సంసారమనే అరణ్యంలో తిరుగుతున్నాను. మన్మథుడనే భయంకర క్రూర మృగం పట్టిపీడిస్తోంది. మాత్సర్యం అనే మండు వేసవి మలమలమాడుస్తోంది. ఈ దుఃఖాల నుంచి నాకు చేయూతనిచ్చి కాపాడు.సంసార సర్ప
ఘన వక్త్ర భయోగ్ర తీవ్ర
దంష్ట్రా కరాళ విష దగ్ధ వినష్టమూర్తే!
నాగారి వాహన! సుధాబ్ధి నివాస శౌరే
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌గరుడవాహనా… క్షీరాబ్ది శయనా.. ఓ శౌరీ ఈ సంసారం భయంకరమైన సర్పం. దాని కాటుతో శరీరమంతా ఆ విషం వ్యాపించి ఉంది. అలాంటి నాకు చేయూతనిచ్చి రక్షించు.
మరో ప్రఖ్యాత శ్లోకంలో భవసాగరాన్ని దాటించమనే భక్తుడి ఆర్తి ప్రస్ఫుటమవుతుంది.సంసారదావ దహనాతుర భీకరోగ్ర
జ్వాలావళీభి రభిదగ్ధ తనూర హస్య
త్వత్పాద పద్మసరసీ శరణాగతస్య
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌ఈ సంసారం ఓ కార్చిర్చు. కలత కలిగించే మహా జ్వాలా సమూహంలో నేను కాలిపోతున్నాను. ఆ బాధనుంచి బయట పడడానికి నీ పాదపద్మాలను శరణు కోరుతున్నాను. ఓ స్వామీ నాకు చేయూతనివ్వు! అనేది ఈ శ్లోకభావం.
సమాజంలో ధర్మ సంస్థాపనే కాదు మనిషి ధర్మబద్ధతకూ భగవంతుడే అండ. లోకంలోని అసురులనే కాదు లోపలున్న అరిషడ్వర్గాలను కూడా ఆయనే తుదముట్టిస్తాడు. ‘అంధస్య మే హృతవివేక మహా ధనస్య…’ స్తోత్రంలో ఇంద్రియాలను దొంగలుగా అభివర్ణించారు ఆది శంకరులు. ‘ఇంద్రియాలు వివేకాన్ని దొంగిలించి, అజ్ఞానమనే లోతైన బావిలోకి తోసేశాయి… ఇప్పుడు నీవే రక్ష’ అని నారసింహుడిని ప్రార్థించారు. ఈ శ్లోకాల్లో మనిషిలో భక్తి చైతన్యాన్ని నింపే అంశాలు అక్షరాక్షరాన మనకు కనిపిస్తాయి. ఇంద్రియాలకు లొంగి జీవితకాలాన్ని వృథా చేసుకోకుండా భక్తితో మోక్ష మార్గం వైపు నడుచుకోమనే సందేశాన్ని నృసింహ కరావలంబ స్తోత్రం ఉద్బోధిస్తుంది. దానికి భగవంతుడిపై భక్తి, ఆయన సహకారం అవసరమని దానికి చేయూత కావాలని ప్రార్థించడమే ఏకైక మార్గమని చాటిచెబుతుంది.– యల్లాప్రగడ మల్లికార్జునరావు

Tags : Lakshmi Narasimha Swamy Spirituality Yadadri Adhyatmika makarandam