Sale!

Sri Krishna Karnamrutam

శ్రీ కృష్ణ కర్ణామృతం

288.00

Share Now

Description

Sri Krishna Karnamrutham  old cover page

 

 

శ్రీ కృష్ణ కర్ణామృతము

శ్రీకృష్ణ కర్ణామృతం (ఆంగ్లం: Sri Krishna Karnamrutam) సంగీత సాహిత్య రంగాల్లో ప్రఖ్యాతి పొందిన సంస్కృత కావ్యం. దీన్ని వాగ్గేయకారుడు లీలాశుకుడు (వివమందళం స్వామియార్) రచించారు. కర్ణమృతం అనగా చెవులకు అమృతం వంటిదని అని అర్ధం. లోలాశుకుడు దీనిని శ్రీకృష్ణుడి కీర్తించే పుష్పగుచ్ఛంతో పోల్చాడు.

శ్రీ కృష్ణ కర్ణామృతం ” గ్రంధకర్త లీలాశుకుడు. ఈయనకే “బిల్వమంగళుడు” అనే మరో పేరు కూడా ఉంది. ఈయన ఏ ప్రాంతం వాడో ఏ కాలం వాడో స్పష్టంగా తెలియటం లేదు. అయితే ఈ “శ్రీ కృష్ణకర్ణామృతం” లోనిశ్లోకాలు 14 వ శతాబ్దం నుంచీ ఇతర గ్రంధాలలోనూ, శాసనాలలోనూ కనబడుతున్నాయి. అందుకని లీలాశుకుడు 11 వ శతాబ్ది నుంచీ 14 వ శతాబ్ది మధ్యలో ఉండి ఉంటాడని ఊహిస్తున్నారు. ఈ విధంగా చూస్తే లీలాశుకుడు జయదేవుడికంటే గూడా ప్రాచీనుడనే చెప్పాలి.

కృష్ణభక్తుడైన చైతన్య మహాప్రభువులు ఆంధ్రదేశయాత్రలో కృష్ణానదీతీరంలో ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఈ కృష్ణకర్ణామృతగానం విని ఆనందభరితుడై దానికి నకలుప్రతి రాయించుకుని తనతో తీసుకువెళ్ళి వంగదేశంలో ఈ గ్రంధం ప్రాచుర్యంలోకి తెచ్చారని చైతన్యచరితామృతంలో చెప్పబడిఉంది.

ఈ గ్రంధంలోని శ్లోకాలన్నీ “ముక్తక”రూపంలో ఉన్నాయి. అంటే అన్ని శ్లోకాలూ స్వతంత్రంగా సమగ్రమైన అర్ధాన్ని అందిస్తాయన్నమాట. కధకోసం, భావంకోసం ముందు వెనకల శ్లోకాలు చూడక్కర్లేదు. ఈ గ్రంధం అద్భుతమైన వేదాంత, సాహిత్య, సంగీత, భక్తి, వ్యాకరణ, ఛందోవిషయాల సమాహారమని చెప్పవచ్చు. ఈ కావ్యంలోని సచేతనాలైన గోవులు, గోపాలురు, గోపికలు మాత్రమే కాకుండా గృహాలు, స్తంభాలు, గజ్జెలు, పూసలు, మణులు, వెన్నముద్దలు, పాలు, పెరుగు, కుండల వంటి జడపదార్ధాలు కూడా ఎంతో చైతన్యవంతంగా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించటం మరో విశేషం.

Sri Krishna Karnamrutham