Pillala Perlu (Babu)

పిల్లల పేర్లు (బాబు)

36.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

పిల్లల పేర్లు (బాబు)

జన్మోత్సవం!
పుట్టుక… ఓ వేడుక
జన్మ ఓ అద్భుతం… జన్మనివ్వడం అదో వరం…
తమ కలల పంట భూమిపై పడే ఆ క్షణం…
అమ్మ, నాన్న చేసే తపస్సు ఫలించే తరుణం…
ఇంత అపురూప క్షణాలను అంతే పదిలంగా దాచుకోవాలనే భావన ఇప్పుడు పెరుగుతోంది…
బిడ్డ తమ కుటుంబంలోకి వచ్చే రోజును పండగలా చేసుకునే సంస్కృతి విస్తరిస్తోంది…
దీనికోసం బిడ్డ కడుపులో పడ్డ క్షణం నుంచే ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో ఆసక్తికర ఉత్సవాలు…
ఒకప్పటిలా కాదు…పిల్లలు అంటే ఒకరు తప్పితే ఇద్దరు. చాలా మంది భార్యభర్తలది ఇదే బాట. దీంతో వారికి సంబంధించిన ప్రతి సందర్భాన్ని ఎంతో అపురూపంగా మలుచుకునేందుకు ఆసక్తి పెరుగుతోంది. పెళ్లైన తర్వాత పిల్లల కోసం ఏడాది ముందే నుంచే భార్యాభర్తలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మేనరికం, దగ్గరి బంధువుల్లో పెళ్లిళ్లు చేసుకుంటే పుట్టే పిల్లలకు జన్యుపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. ఒకవేళ తప్పదని పెళ్లి చేసుకున్నా సరే… పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బందులూ రాకూడదు. అందుకే జన్యు కౌన్సెలింగ్‌ నిపుణులను సంప్రదించడం ఇటీవల బాగా పెరిగింది. బేగంపేటలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌ అండ్‌ హాస్పిటల్‌ ఫర్‌ జెనెటిక్‌ డిసీజెస్‌ సంస్థకు ఈ తరహా కౌన్సెలింగ్‌కు వచ్చే జంటల సంఖ్య బాగా పెరుగుతోంది.