Phaladeepika telugu Mantreswara

ఫలదీపిక – మంత్రేశ్వర

– Sri puchha Srinivasa Rao 

198.00

Share Now

Description

Phaladeepika (Mantreswara) – పుచ్చా శ్రీనివాసరావు

మంత్రేశ్వర విరచిత ఫలదీపిక 
Author : Sri puchha Srinivasa Rao 

     మంత్రేశ్వరునిచే రచించబడిన “ఫలదీపికా”- 28 అధ్యాయాలు 855 శ్లోకములతో కూడిన గ్రంథం. జ్యోతిష ఫలశాస్త్రములో ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి. పరాశర పద్ధతిని అనుసరించిన గ్రంథమని “సంక్షిప్యాతి పరాశరాది కథితాన్ మంత్రేశ్వరో దైవవిత్” పూర్వాచార్యులగు అత్రి పరాశరాదుల మతములను సంగ్రహించి తన ఫలదీపికను విరచించినట్లు చెప్పుకున్నాడు.  
     వక్రగ్రహముల విషయంలో సారావళితో విభేదించి బలాబల విచారణ చేసే విధానం, ఇందులో పాఠకులకు ఆసక్తిని కలిగించేది పుత్రచింత అనే 12వ అధ్యాయము. అందు సంతానస్ఫుట సాధన, దోషములకు చేయవలసిన శాంతులు వివరంగా చెప్పబడ్డాయి. ఇవి ఈనాటికి చక్కని ఫలితాలు చూపిస్తున్నాయి. 15వ అధ్యాయంలో రెండు రాశులకు ఆధిపత్యం  గల గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలావుంటాయనే వివరణ, 17నిర్యాణ భావంలో మరణ సమయాలను తెలుసుకోవడానికి చేసే సులువైన గణితాలు, 26గోచారాధ్యాయంలో సర్వతోభద్ర చ్రకం అనుసరించి వేధలు, ఫలితాలు తెలియచేసే విధానం ఇలా అనేక చక్కని విషయాలతో కూడిన గ్రంథము.
    గ్రంథకర్త మంత్రేశ్వరుడు సద్భ్రాహ్మణుడని, సుకుంతలాంబ దేవిని ఉపాసించిన మహోపాసకుడని శ్రీశాలివాటి గ్రామనివాసి అని చెప్పుకోవడం జరిగింది. ఈ గ్రామం ఇది తమిళనాడులోని తిరునల్వేనిలోనిదని ఎక్కువమంది అభిప్రాయము మరికొందరి ఈయన కేరళావాసి అని చెప్పినా ఎక్కువమంది తమిళనాడు వాడనే చెపుతారు. అలాగే ఆయన 13వ శతాబ్దం వాడని, మరికందరు 16వశతాబ్దం వాడని చెప్పినా ఈనాటికి ఈ వాదన తేలలేదు. పండితభూషణ వి,సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆంగ్ల వ్యాఖ్యానాన్ని తీసుకుని అనువాదం చేయడం జరిగింది. జ్యోతిశ్శాస్త్ర పరిచయం వున్న  ప్రతి జ్యోతిష్యుని వద్ద ఉండవలసిన గ్రంథం అని  ఫలితాలు తెలియచేయడంలో కామధేనువని పెద్దలు చెపుతారు.