Sale!

PhalaDeepika in telugu (Victory)

ఫలదీపిక
-Dr. Pandit Malladi Mani

555.00

మరిన్ని Telugu Books కై
Tags: ,
Share Now

Description

యోగములు – ఫలములు ( ఫలదీపిక ) Phala Deepika
మహాభాగ్య యోగము. – ఈ యోగమున శిశువు జనకాలము శిశువు లింగము కుడా ప్రధానము. అనగా పగలా రాత్రియా, స్త్రీ శిశువా పురుష శిశువా ఈ విషయములు పరిగణ లోనికి తీసుకోవాలి. పగటి కాలమున జనమైన పురుష సంతతి అయిన, ఆ బాలునకు, లగ్నము, రవి, చంద్రుడు విషమ రాశులందు, రాత్రి కాలమున జన్మించిన బాలికలకు, ఈ లగ్నము, రవి, చంద్రుడు సమరాశులయందు ఉన్నచో దానిని మహా భాగ్యయోగముగా చెప్పాలి. విషమ రాశులంటే బేసి రాశులు. ఈ యోగములో జన్మించిన పురుషులు, మంచి నడవడిక కలిగి , స్వతంత్రము కోరుకొనే వారు, ఇతర్తులకు ఉపకారము చేయు బుద్ధి గలవారు కీర్తి గౌరవము కలిగి జీవితంలో చరమ దశలో గూడా శుఖజీవనము చేయుదురు. ఈ యోగములో జన్మించిన స్త్రీలకు మాత్రము, ఆయుషు అధికము, సంతాన భాగ్యము, ఎక్కువ, మంచి సీలము, సంపాదన కలిగి ఉందురు. రవి ఆత్మ తను ఆరోగ్య కారకుడు, చంద్రు బుద్ధి, మాత మనస్సు కారకుడు. అందుచే ఈ ఫలము చెప్ప వలెను. మహా భాగ్యయోగమని ఎందుకన్నారో !. ఇదో భాగ్యము మాత్రమె. చాలా జాతకములలో చూడవచ్చును.