sri Pancha Kali Tantram

శ్రీ పంచ కాళీ తంత్రం
 The Ultimate Reality within you
– Sri Swamy Ramananda

198.00

Share Now

Description

సత్ సాధకుల కోసం  కొన్ని శ్రీ రామానంద గారి సాధన విశేషాలను ఇస్తున్నాను.

స్వామి రామానంద గారు అత్యున్నతమైన విద్యను అభ్యసించారు.(MBA in  IIM A ),వీరి అసలు పేరు గోటేటి రామానంద శర్మ గారు, తన యుక్త వయస్సులోనే ఉన్నత  సత్యం కోసం పరితపించి అద్భుతమైన ఉద్యోగాన్ని వదిలి మరియు పెండ్లి మొదలైన వాటిని గూర్చి ఆలోచించక సన్యాసం వైపు మొగ్గు చూపి శ్రీ దయానంద సరస్వతి స్వామి వారి ఆశ్రమం, రిషికేష్  లో చేరారు వారి వద్ద వేదాలు ఉపనిషత్తులు ధ్యానము మొదలగునవి అభ్యసించారు. తరువాత తనకు గల తంత్ర విద్య పై ఆసక్తి ని గురువు గారికి తెలిపి వారి ద్వారా స్వామి శ్రీ నిఖిలేశ్వర మహారాజ్ గారి వద్దకు వెళ్లారు. స్వామి నిఖిలేశ్వర మహారాజ్ గారు స్వామి రామానంద ను ఆశీర్వదించి నీవు 16 జన్మల నుండి కాళీ ఉపాసన చేస్తున్నావని నేనే నిన్ను నడిపిస్తున్నానని ఇది చివరి జన్మ అని ఈ జన్మ లో కూడా కాళీ ఉపాసన కొనసాగించమని ఆజ్ఞాపించారు, వారి సూచనలతో స్వామి రామానంద హిమాలయాలలోని గోముఖ్ దగ్గర గుహలలో కాళీ మాత ఉపాసన చేసి కృతకృత్యులయ్యారు. ఒకానొక సాధువు నీకు ఫలానా రోజు అమ్మవారు కనబడుతుంది అని చెప్పారు, అదే రోజు  వెన్నెల నిండిన రాత్రి వేళ వీరికి కాళీ మాత దర్శనం అయ్యింది మరియు చండి మాత దర్శనం కూడా అయ్యింది. భవిష్యత్ ప్రణాళిక వీరికి అర్ధమైంది, అది మొదలు తన జీవితాన్ని కాళీ చండి ఉపాసనలకు అంకితం చేశారు. వీరికి శ్రీ పరమహంస నిఖిలేశ్వర్ మహారాజ్ గారు ఒక కాళీ మాత విగ్రహాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు, కానీ అది కుదరకుండా వారు శివైక్యం పొందారు. దాని వలన వీరికి కొంత నిరుత్సాహం కలిగింది, కాబట్టి శ్రీ అనిల్ కుమార్ జోషి గారు తన తన గురువు గారి మాటనిలబెట్టడానికి రామానంద గారికి తన ఉదరం నుండి హిమ కాళీ విగ్రహాన్ని తీసి ఇచ్చారు, (ఈ సందర్భలో తెలుసుకోవలసిందేమిటంటే శ్రీ  జోషి గురువు గారు ఆంధ్ర లో మరొక  ముఖ్యమైన  సిద్ధ కాళీ విగ్రహ ప్రతిష్టాపనకు మూల పురుషులు అనే విషయం చాలా మందికి తెలియదు.)

స్వామి రామానంద గారు ఈ హిమ కాళీ అమ్మవారిని 18 సంవత్సరములు విజయవాడలో హిమ కాళీ పీఠం పెట్టి ఆరాధన చేశారు. వీరు అనేక మందికి మంత్ర దీక్షలు కూడా ఇచ్చారు, వారికి ఇప్పటికీ కాళీ చండి విద్యలనే ముఖ్యం గా సాధన చేస్తారు. దాని ఫలితం గానే వారు శ్రీ రుద్రచండి ని తెలుగులోకి వెలుగు లోకి తేగలిగారు, వీరికి నాగ తంత్రములయందు శ్రీవిద్య యందు కూడా మంచి సాధన అనుభవం వున్నది. వీరు కొల్లూరు మూకాంబిక మరియు బాసర సరస్వతి దేవతల వద్ద మంచి సాధన చేసి మంచి అనుభవములను పొంది యున్నారు.

వీరు ప్రసుతం తన గురు భాయ్ శ్రీ అనిల్ కుమార్ జోషి గారి ఆశ్రమములో ఉండి వారి ద్వారా గురు సేవలో ఉన్నత సోపానాలు  అధిరోహిస్తున్నారు.   – శ్రీ కలానంద నాథ