MahaBharatam Telugu Gita Press by Vyasa Maharshi

గోరఖ్ పూర్ వారి మహాభారతం Full Set
శ్లోక తాత్పర్య సహితం
A4 size : 7 books :13 kgs
7304 Pages
7 Parts 

2,800.00

+ Rs.450/- For Handling and Shipping Charge
Share Now

Description

గోరఖ్ పూర్ వారి మహాభారతం | code 2141 to 2147
శ్లోక తాత్పర్య సహితం
7 Parts
‘వింటే భారతం వినాలి.. తింటే గారెలే తినాలి’ అనేది సుప్రసిద్ధ నానుడి. అంతటి మాధుర్యం ఉన్న మహాభారతం త్వరలోనే తెలుగు పాఠకులకు మరింత చేరువకానుంది. ఆధ్యాత్మిక గ్రంథాలను ముద్రించి చవక ధరల్లో అందించే గీతాప్రెస్‌ త్వరలో సంపూర్ణ మహాభారతాన్ని తేటతెలుగులో అందుబాటులోకి తేనుంది. లక్ష శ్లోకాలు, 18 పర్వాల పంచమ వేదాన్ని ఏడు సంపుటాల్లో 7248 పేజీల్లో మనముందుకు తీసుకురానుంది. భారతాన్ని 1955లో హిందీలో తొలిసారి ముద్రించిన గీతాప్రెస్‌ ఆ తర్వాత 18 సార్లు పునర్‌ ముద్రించి లక్షలాది కాపీలను పాఠకులకు చేరువ చేసింది. అయితే, హిందీయేతర భాషల్లో తొలిసారిగా తెలుగులోనే సంపూర్ణ మహాభారత ముద్రణకు గీతాప్రెస్‌ పూనుకోవడం విశేషం. డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి, డా.సూరం శ్రీనివాస్‌ల నేతృత్వంలో 12 మంది పండితుల బృందం అనువాద ప్రక్రియను  పూర్తిచేసిందని గీతాప్రెస్‌ ప్రతినిధి చెప్పారు. శ్లోకతాత్పర్యాలేకాక నీలకంఠీయ వ్యాఖ్యానాల విశేషాలను కూడా ఇందులో జతచేయడం విశేషం. కవిత్రయ విరచితమైన తెలుగుభారతంలోని పద్యాలను సందర్భోచితంగా జోడించడం ద్వారా అనువాద ప్రక్రియకు మరింతగా వన్నెలు అద్దారు. .MahaBharatham Telugu