Kasi Majili Kathalu – 6 Books

950.00

కాశీ మజిలీ కథలు
6 Books – 12 Parts
Pages : 2610


మరిన్ని పుస్తకాలకై

Category:


Share Now

కాశీ మజిలీ కథలు
6 Books – 12 Parts
Pages : 2610

        కాశీ మజిలీ కథలు మధిర సుబ్బన్న దీక్షితకవి రచించిన కథల సంకలనం. దీనిని దీక్షితకవి 12 భాగములుగా వచనమున రచించెను.

దీనిని 1934లో కందుల సూర్యారావు, రాజమండ్రి వారు రామమోహన ముద్రాక్షరశాల యందు ముద్రించారు

మణిసిద్ధుడనే యతి, గోపకుమారునితో దక్షిణాత్య ప్రాంతం నుంచి హిందువులకు పరమ పవిత్ర స్థలమైన కాశీ చేరుకునేందుకు కాలినడకన ప్రయాణమవుతారు. ఆ దారిలో జరిగే కథతో పాటు కాశీయాత్రలో వేసుకునే ప్రతి మజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీ కథలు. ఈ గ్రంథం తెలుగు వారిలో మంచి పేరొందింది.

అవిభక్త ఘట్టభూమిగా, మోక్షభూమిగా పేరుపొందిన కాశీ పట్టణం వెళ్ళేందుకు మణిసిద్ధుడు అనే విద్యావంతుడైన బ్రాహ్మణ బ్రహ్మచారి సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోవడం, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండడంతో ఎవరైనా తోడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. ఎందరినో అడిగినా వారు భయపడి రాలేదు. తుదకు శ్రీరంగపురం ఊరి శివార్లలో జీవించే పశువుల కాపరి, అనాథయైన కోటప్ప మాత్రం బయలుదేరాడు. ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కాశీకి మజిలీలు చేసుకుంటూ బయలుదేరడం ప్రధాన కథ కాగా ఆపైన ఎన్నెన్నో ఉపకథలు, గొలుసుకట్టు కథలు ఉంటాయి. మార్గమధ్యంలో తనకు వింత వింత కథలు చెప్పి అలసట పోగొట్టి ఆహ్లాదం కలిగిస్తే వస్తానని గోపాలుడు పెట్టిన షరతుకు ఫలితమే ఆ కథలు. కథలలో పతివ్రతల ప్రభావము, దుష్టస్త్రీల కుచ్చితచేష్టలు, సత్పురుష సాంగత్యము వలన కలుగు లాభములు, దుష్టుల సహవాసము కలుగు నష్టములు, దేశాటనము పండితసంపర్కములవలన కలుగు జ్ఞానము, రాజనీతి, వ్యవహార వివేకము, వదాన్యలక్షణము, లోభిప్రవృత్తి మున్నగు అనేక విశేషములు వర్ణించబడినవి. ఇవికాక కృష్ణదేవరాయలు, భోజరాజు, శంకరాచార్యులు, విక్రమార్కుడు, నారదుడు, ప్రహ్లాదుడు మొదలైన మహాపురుషుల చరిత్రలను విచిత్రముగా వ్రాయబడ్డాయి.

All Parts Play List: