Description
ఇదీ నిజమైన దైనందిని (డైరీ)
మనకు జీర్ణించుకుని పోయిన అలవాటు… తప్పేమీ కాదనుకోండి… కొత్త ఏడాది వస్తోందనగానే దైనందిని (డైరీ) కొనటం లేదా సేకరించటం, ఆ తర్వాత కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి అందులో వ్యవహారాలు రాసుకోవటం… మనలో చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. ఇది చాలా మంచి అలవాటు కూడా. అయితే తెలుగు వారిగా మన కొత్త ఏడాది ఉగాదితో మొదలవుతుంది. అదంతా చర్చ చేస్తే వ్యవహారం మరో దారికిపోతుంది. ఉన్న అలవాటులోనే మంచి అలవాటు చేసుకునే (మనతో చేయించే) ప్రయత్నం చేశారు రాఘవేంద్ర పబ్లిషర్స్ అధినేత శ్రీ దిట్టకవి రాఘవేంద్ర రావు గారు.
*సాధారణ డైరీలకు భిన్నంగా కొత్త ఏడాది (2022) డైరీని భగవద్గీత డైరీగా రూపొందించారు*. *ప్రతి తేదీ, వారం, ముఖ్యమైన సంఘటనలు, పంచాంగ వివరాలతో పాటు భగవద్గీత శ్లోకాలు తాత్పర్యాలతో సహా పొందుపరిచారు*. *ఏడాది పూర్తయ్యేసరికి 18 అధ్యాయాల భగవద్గీత పూర్తయ్యేలా ప్రణాళిక చేసారు*. *రోజూ దైనందిని రాసుకుంటూ ఓ శ్లోకాన్ని చదువుకున్నా ఏడాది పూర్తయ్యే సరికి చక్కటి భావంతో సహా భగవద్గీత నేర్చుకోవచ్చు*. *కంఠస్థం చెయ్యవచ్చు కూడా*. ముఖ్యంగా బాలలు, యువకులకు ఈ దైనందిని అవసరం ఎంతో ఉంది. *పెద్దలంతా ఈ కొత్త ఏడాదికి పిల్లలకు ఈ దైనందినిని బహుమతిగా ఇవ్వండి*. ఇదే అసలైన బహుమతి… దైనందిని కూడా.