Garuda Puranam Telugu Gita Press – Vaddiparti Padmakar – 2359

గరుడ పురాణం  వచనం

ఇంట్లో ఉంచుకొని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగును
—————-
————–

19CM × 28 cm | 704 Pages | 1400Grams

250/- + Includes Rs.150 Shipping & Handling

400.00

Share Now

Description

గరుడ పురాణం

శ్రీ రామ జయం🚩
శ్రీ గురుభ్యోనమః🙇‍♂️

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు అనువదించిన గీతాప్రెస్ వారి “*శ్రీ గరుడపురాణము*” పరమ పవిత్ర *నైమిశారణ్యములో* భగవద్భక్తుల సన్నిధిలో సెప్టెంబర్ 6 (శనివారం) నాడు ఆవిష్కరణ మరియు శ్రీ గరుడ మహాపురాణ గ్రంథమును స్వర్ణ సింహాసనం పై ఊరెరిగింపు మరియు ప్రత్యేక పూజ చేయనున్నారు!

శ్రీ గరుడ మహా పురాణము ప్రధానంగా శ్రీ మహావిష్ణువు మరియు గరుడుడు (విష్ణువు వాహనం) మధ్య సంభాషణగా చెప్పబడింది!

🔹 శ్రీ గరుత్మంతుడు – “ప్రభూ! జీవులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వారి ఆత్మకు ఏమవుతుంది? పుణ్యపాప ఫలితాలు ఎలా అనుభవిస్తారు? ఆత్మ యాత్ర ఎలా జరుగుతుంది? ధర్మాధర్మ ఫలితాలు గురించి వివరించమని” శ్రీమహావిష్ణువును అడుగుతాడు.

🔹 శ్రీ మహావిష్ణువు – ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిన క్షణం నుండి యమలోక యాత్ర, పుణ్యపాప విచారణ, నరకస్వర్గ ఫలితాలు, శ్రాద్ధ క్రియలు, చివరికి మోక్ష మార్గం వరకు గరుడుడికి విపులంగా వివరిస్తారు.

🕉️ గరుడ పురాణం ద్వారా శ్రీ మహా విష్ణువు గరుడుడికి చెప్పిన ముఖ్యాంశాలు 🕉️

1. ఆత్మ యమలోక యాత్ర – శరీరం విడిచిన తర్వాత 16 రోజులపాటు ఆత్మ చేసే ప్రయాణం.

2. యమధర్మరాజు తీర్పు – చిత్తపాప పుణ్యాల లెక్కను యముడు చూసి ఆత్మను స్వర్గం లేదా నరకం వైపు పంపిస్తాడు.

3. పాపఫలాలు – వేరువేరు నరకాలలో పొందే శిక్షలు (అగ్ని నరకం, అంధకూపం మొదలైనవి).

4. పుణ్యఫలాలు – స్వర్గసుఖాలు, దేవలోకాలలో నివాసం.

5. శ్రాద్ధ & దానములు – జీవించి ఉన్నవారు చేసే కర్మలు ఆత్మ యాత్రకు ఉపకారం అవుతాయి.

6. మోక్షమార్గం – విష్ణుభక్తి, సత్సంగం, ధర్మాచరణం ద్వారా పునర్జన్మ బంధనాల నుండి విముక్తి.

👉 శ్రీ గరుడ పురాణం మనకు ఒక జీవన మార్గదర్శకము లాంటిది – “ఎలా జీవిస్తే పుణ్యం, ఎలా చేస్తే పాపం, చివరికి ఆత్మ ఏ మార్గం పడుతుంది” అన్నది స్పష్టంగా చెబుతుంది.

🔸శ్రీ గురుడ పురాణం పుస్తకాలు సెప్టెంబర్ 6 తరువాత అందుబాటులో ఉంటాయి!

*గీతాప్రెస్ Book code No. 2359*
*వెల: ₹250*

బలం గురో: ప్రవర్ధతాం💪
బలం విష్ణో: ప్రవర్ధతాం💪

vaddiparti garuda puranam | garuda puranam vaddiparti | gita press garuda puranam telugu gita press