Sri Dhumavati Sadhana

శ్రీ ధూమావతీ సాధన

99.00

Share Now

Description

Sri Dhumavati Sadhana

Author: Dr. Jayanti Chakravarthi
Pages: 112

శ్రీ ధూమావతీ సాధన కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు. ధూమవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమావతీ దేవి దశమహావిద్యలలో ఏడవ మహావిద్య. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతకి ఉచ్ఛాటన దేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్ఛాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమావతీ దేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ రోగాల నుంచి, శోకాల నుంచి విముక్తి కలుగుతుంది. శ్రీ ధూమావతీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీ ధూమావతీ దేవి గురించి, వివిధ రకాలైన ధూమావతీ మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీ ధూమావతీ అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాను. నమస్కారాలతో…. – డా. జయంతి చక్రవర్తి