Description
చందురిని మించు అందమొలకించు…
చందురుని మించు అందమొలకించు
ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ
కరగిపోయేనులే
కరుణతో చూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే ||2||
చరణం 1
అన్న ఒడి చేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల కృంగు
నేటి కధ పాడనా కన్నీటి కధ పాడనా
కలతలకు లొంగి.. కష్టముల కృంగు..
కన్నీటి కధ పాడనా…
కంటిలోపాప ఇంటికే జ్యోతి చెల్లి నా పాణమే
చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసె వెతలలో ద్రోసె
మిగిలెనీ శోకమే ||2||
విధియె విడదీసె.. వెతలలో ద్రోసె..
మిగిలెనీ శోకమే… ||చందురుని మించు||
చరణం 2
మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింట మనువునే కోరుమా
బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా
కాలమెదురైనా గతులు వేరైనా
మమతలే మాయునా
పెరిగి నీవైనా అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా
దివిలో తారకలు భువిలో మానవులు
ధూళిలో కలిసినా
అన్నచెల్లెళ్ల జన్మబంధాలే నిత్యమై నిల్చులే
లాలి పాపాయి హాయి పాపాయి
లాలి పాపాయి జోజో లాలి పాపాయి జోజో