Bhartruhari Shubhashitalu

భర్తృహరి సుభాషితాలు

40.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

Bhartruhari Shubhashitalu

భర్తృహరి సుభాషితాలు

భర్తృహరి రెండు ప్రభావవంతమైన సంస్కృత గ్రంథాలు రచించిన సంస్కృత కవి. ఇతను 5వ శతాబ్దానికి చెందినవాడు. సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. ఇది సంస్కృత లఘుకావ్యం. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి.

సుభాషిత త్రిశతి లేక సుభాషిత రత్నావళి యను నది కావ్యములలో లఘుకావ్యజాతిలో చేరినను. ఈ కావ్యమును రాసిన భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీన కవులలో ఒకడు. అతనిని, ఆతని గ్రంథములను గూర్చి విశ్వసనీయము లగు చారిత్రికాధారములు కానరావు. అతని జీవితములోని కొన్ని సంభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా సంప్రదాయబద్ధమై లోకమున వ్యాపించి యున్నను అవి ఒకదానికొకటి పొంది పొసగి యుండకపోవుటచే నానా విధ గాథలకును సామరస్య మేర్పరచుట దుస్సాధ్యమేయగును. భర్తృహరి ఉజ్జయినీ రాజ వంశస్తుడనియు, తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తన భార్య దుశ్శీలముచే సంసారమునకు రోసి, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వానప్రస్థుడయ్యెననియు నొక ప్రతీతి ఉంది. ఈ విక్రమార్కుడే విక్రమ శకాబ్దమునకు మూల పురుషుడు. అది యటుండనిండు. భర్తృహరి విరచితమైన లఘు శతకముల నుండి యతనికి జీవితమున నాశా భంగము మిక్కిలిగా యేర్పడెననియు, స్వకుటుంబమును, యిరుగుపొరుగులను సూక్ష్మ దృష్టితో పరిశీలించుట వలన స్త్రీ శీలమునందు అతనికి సంశయము బలపడెననియు విశదమగును. అతనిని గూర్చి గ్రంథస్థమైన విషయములలో గొన్నింటిని పేర్కొందము.