Aaharam Vaidyam

ఆహారం వైద్యం 

150.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

aaharam vaidyam book(telugu)

ఆహారం వైద్యం aaharam vaidyam book

అమ్మలాంటి అంజీర్
anjeer
వగరు, తీపి, పులుపు కలిపి ఉండే ఈ పండ్లు వానకాలంలో ఎక్కువగా పండుతాయి. అంజీర్‌లో పిండి పదార్థాలు, చక్కెర పదార్థాలు, సి, ఎ, బి6 విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
శరీరానికి కావాల్సినంత పొటాషియం, క్యాల్షియం ఇందులో ఉంటాయి. సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి ఖనిజ పదార్థాలకైతే లోటే లేదు.
రక్తహీనతతో బాధపడేవారికి అంజీర్ మంచి ఔషధం. ఇది శరీరంలో రక్తాన్ని వృద్ధి చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
పిస్తా.. పోషకాల బస్తా
pistha
శరీరానికి ఖరీదైన పోషకాలనిచ్చే వాటిలో పిస్తా ముందుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సాగవుతున్న ఖరీదైన డ్రైఫ్రూట్స్‌లో పిస్తా ముఖ్యమైంది.
తక్షణ శక్తినిచ్చే వాటిలో పిస్తా బెటర్. బరువు తగ్గాలనుకునేవారు గుప్పెడు పిస్తా పప్పు తింటే.. కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఇది మంచి బలవర్ధకమైన ఆహారం కూడా.
కొవ్వు, పీచు పదార్థాలు, మాంసకృత్తులు పిస్తాలో చాలా ఉంటాయి. బి6, సి, ఇ విటమిన్లు పిస్తాలో లభించే వాటిలో ముఖ్యమైనవి. పొటాషియం పాళ్లు పిస్తాలో పుష్కలంగా ఉంటాయి.
జీర్ణశక్తి లోపంతో బాధపడేవారికి పిస్తా మంచి ఔషధం.
ఇందులో ఉండే బి6 విటమిన్లు జీర్ణశక్తిని పెంచడంలో ఉపయోగపడుతాయి. డ్రైఫ్రూట్స్ అన్నింట్లో కంటే పిస్తాలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో పిస్తా బాగా పనిచేస్తుంది.